Allergies : సెప్టెంబర్ నెలలో అలర్జీలు, జలుబు పెరగడానికి ప్రధాన కారణాలు..?
సాక్షి లైఫ్ : సెప్టెంబర్ నెలలో వర్షాల ప్రభావం తగ్గి, వాతావ రణం మారుతుంటుంది. పగటిపూట వేడి, ఉదయం, సాయంత్రం వేళల్లో చలితో ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. దీనివల్ల చాలామంది తుమ్ములు, ముక్కు కారడం, గొంతులో గరగర, దగ్గు, శ్వాస సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. వాతావరణం మారే సమయంలో ఈ సమస్యలు ఎందుకు పెరుగుతాయి..? వాటి నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు..
పగలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం పెరగడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరం త్వరగా సర్దుబాటు కాలేదు. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గి, శ్వాసకోశ సమస్యలు వస్తాయి. వాతావరణ మార్పుల సమయంలో వైరస్‌లు వేగంగా వృద్ధి చెందుతాయి. జలుబు లేదా దగ్గుతో బాధపడుతున్న వారు తుమ్మినప్పుడు గాలిలోకి చేరే తుంపర్ల ద్వారా ఈ ఇన్ఫెక్షన్లు ఇతరులకు సులభంగా వ్యాపిస్తాయి.
వర్షాల కారణంగా వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇళ్లలోని తడి గోడలు, స్నానపు గదుల్లో పెరిగే ఫంగస్ (fungus) కారణంగా.. సున్నితమైన శరీరతత్వం ఉన్నవారికి ముక్కు దిబ్బడ, తుమ్ములు వంటి అలర్జీలు వస్తాయి. వర్షాలు తగ్గిపోయి రోడ్లు ఎండిపోవడం ప్రారంభమయ్యాక గాలిలో దుమ్ము కణాలు అమాంతం పెరుగుతాయి. ఇవి వాతావరణ కాలుష్యంతో కలిసి కళ్లు, గొంతు, ముక్కులో మంటను కలిగిస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఇల్లు, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము, కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి. బయట నుంచి రాగానే, భోజనానికి ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
రోగనిరోధక శక్తిని పెంచే పోషకాహారం తీసుకోవాలి, రోజుకు సరిపడా నిద్ర పోవాలి. మీకు ఏవైనా పడని పదార్థాలు, వాసనలు ఉంటే వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. జ్వరం తీవ్రంగా ఉన్నా, జలుబు లక్షణాలు ఎక్కువ రోజులు వేధిస్తున్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
