సాక్షి లైఫ్ : గుడ్డు (Egg)లో అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని 'న్యాచురల్ విటమిన్ పవర్ హౌజ్'గా భావిస్తారు. ముఖ్యంగా మహిళల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా గుడ్లు అందించే పోషకాలు ఎంతో ప్రయోగకరంగా ఉంటాయి. హార్మోన్ల మార్పులు, ఎముకల ఆరోగ్యం, గర్భధారణ వంటి ప్రత్యేక దశలను ఎదుర్కొనే మహిళలకు గుడ్లు అద్భుతమైన ఆహారంగా పనిచేస్తాయని పోషకాహారనిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రతిరోజూ ఒక గుడ్డు తినడం వల్ల మహిళలకు కలిగే 7 ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
1. కండరాల బలం,బరువు నియంత్రణ (Weight Management)..గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ ప్రోటీన్ కండరాల నిర్మాణానికి, వ్యాయామం తర్వాత కణజాల మరమ్మతుకు సహాయపడుతుంది. అంతేకాకుండా, అల్పాహారంలో గుడ్డు తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీనివల్ల అనవసరమైన చిరుతిళ్లు తినకుండా ఉండడం ద్వారా, అధికబరువు నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది.
2.మెదడు ఆరోగ్యం & జ్ఞాపకశక్తి (Brain Health)..గుడ్డు పచ్చసొనలో కోలిన్ (Choline) అనే కీలక పోషకం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మెదడు, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి కోలిన్ చాలా అవసరం. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
3.గర్భిణులకు రక్షణ (Protecting Pregnancy).. గుడ్లలోని కోలిన్, ఫోలేట్ (Folate), గర్భిణీ స్త్రీలకు ఎంతో ముఖ్యమైనవి. ఇవి గర్భంలో పెరుగుతున్న శిశువు మెదడు, వెన్నెముక అభివృద్ధికి (Neural Tube Development) కీలకం. కోలిన్ అనేది గర్భస్రావం, పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
4.కంటి చూపు మెరుగుదల (Eyesight Protection)..గుడ్డు పచ్చసొనలో లుటిన్ (Lutein) జియాక్సాంథిన్ (Zeaxanthin) అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటిలోని రెటీనాను రక్షించి, వృద్ధాప్యం కారణంగా వచ్చే కంటిశుక్లం (Cataracts) మాక్యులర్ డీజెనరేషన్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
5.ఎముకలు దృఢత్వం (Bone Strength)..గుడ్డు అనేది కొన్ని సహజ ఆహార వనరులలో లభించే "విటమిన్ డి (Vitamin D)"కు మంచి వనరు. విటమిన్ డి శరీరంలో కాల్షియంను గ్రహించడానికి, ఎముకలను దృఢంగా ఉంచడానికి అత్యవసరం. ముఖ్యంగా మెనోపాజ్ దశ దాటిన మహిళలకు ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు బలహీనపడటం ప్రమాదం ఉంటుంది కాబట్టి, గుడ్లు తీసుకోవడం చాలా ప్రయోజనకరం.
6.గుండె ఆరోగ్యానికి మద్దతు (Cardiovascular Support)..గుడ్డులోని కొలెస్ట్రాల్ గురించి గతంలో ఆందోళనలు ఉన్నప్పటికీ, ఆధునిక పరిశోధనల ప్రకారం, గుడ్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచవు. బదులుగా, అవి 'మంచి కొలెస్ట్రాల్' (HDL) స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, గుడ్లలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
7.అందం & చర్మ సంరక్షణ (Hair and Skin Health)..గుడ్లలోని విటమిన్ ఇ, బి-విటమిన్లు (ముఖ్యంగా బయోటిన్) ప్రోటీన్లు ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం, గోర్ల పెరుగుదలకు మద్దతు ఇస్తాయి. ఇవి కణజాల మరమ్మతుకు సహాయపడి, చర్మ సహజ కాంతిని మెరుగుపరుస్తాయి.
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com