గుండెకు హైపర్‌ థైరాయిడిజమ్‌ కు మధ్య లింక్ ఏంటి..?  

షేర్ చేయండి:
గుండెకు హైపర్‌ థైరాయిడిజమ్‌ కు మధ్య లింక్ ఏంటి..?  

సాక్షి లైఫ్ : థైరాయిడ్‌ సంబంధిత సమస్యలపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించడానికి ‘ద అమెరికన్‌ థైరాయిడ్‌ అసోసియేషన్‌’ ప్రతి సంవత్సరం జనవరి నెలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. హైపోథైరాయిడిజమ్‌ వల్ల గుండె రక్తాన్ని సరఫరా చేసే శక్తి తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు.. కొలెస్ట్రాల్‌, రక్తపోటులను కూడా పెంచుతుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గిపోవడం, రక్తనాళాల సాగే లక్షణం తగ్గుతుంది. 

గుండెపై భారం..

ఫలితంగా శరీరం మొత్తానికి రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండెపై భారం ఎక్కువ పడి రక్తపోటు పెరుగుతుంది.కొలెస్ట్రాల్‌ ఎక్కువ కావడం వల్ల రక్తనాళాలు సన్నబడిపోతాయి. హైపర్‌ థైరాయిడిజమ్‌ ఉంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. తద్వారా గుండె పనిచేయకుండా ఆగిపోయే ‍ప్రమాదం ఎక్కువ అవుతుంది. రక్త నాళాల గోడలపై గార లాంటి పదార్థం పేరుకుపోయే సమస్యను పెంచుతుంది, ఈ గార లాంటి పదార్థం రక్తనాళాలలో గడ్డ కట్టడం వల్ల రక్త ప్రసరణలో అవరోధం ఏర్పడుతుంది.

 

 ఇది కూడా చదవండి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.