Migraine in Women : మహిళల్లో మైగ్రేన్ పెయిన్.. బ్రెయిన్ స్ట్రోక్ కు సంకేతమా..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : చాలామంది మహిళలు 'తలనొప్పే కదా' అని మైగ్రేన్‌ను తేలికగా తీసుకుంటారు. కానీ, ఇది కేవలం నొప్పి మాత్రమే కాదు.. ఒక తీవ్రమైన నాడీ సంబంధిత సమస్య. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య మూడు రెట్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేధించే నాడీ సంబంధిత రుగ్మతల్లో మైగ్రేన్ ఒకటి.

 

ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు.. 

ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

హార్మోన్ల స్థాయిలు.. 

మహిళల్లో మైగ్రేన్ పెరగడానికి ప్రధాన కారణం ఈస్ట్రోజన్ హార్మోన్.పీరియడ్స్ సమయంలో హార్మోన్ల స్థాయిలు ఒక్కసారిగా పడిపోవడం వల్ల మైగ్రేన్ అటాక్స్ ఎక్కువగా వస్తాయి. గర్భధారణ, మెనోపాజ్.. గర్భధారణ సమయంలో కొందరికి ఉపశమనం లభించినా, ప్రసవం తర్వాత లేదా మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ మార్పులు మైగ్రేన్‌ను తీవ్రం చేస్తాయి.

'ఆరా'తో జాగ్రత్త..

మైగ్రేన్‌లో 'మైగ్రేన్ విత్ ఆరా' అనేది కీలకమైన రకం. తలనొప్పి మొదలవ్వడానికి ముందే బాధితుల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

కళ్ల ముందు మెరుపులు, జిగ్‌జాగ్ గీతలు కనిపించడం.

తాత్కాలికంగా చూపు మందగించడం.

చేతులు లేదా ముఖంపై తిమ్మిర్లు రావడం.

మాట తడబడటం.

పక్షవాతం (Stroke) ముప్పు పొంచి ఉందా..?

వైద్య పరిశోధనల ప్రకారం, 'ఆరా' లక్షణాలతో కూడిన మైగ్రేన్ ఉన్న మహిళల్లో పక్షవాతం వచ్చే ప్రమాదం ఇతరుల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ధూమపానం చేసేవారు, అధిక రక్తపోటు (BP), స్థూలకాయం ఉన్న మహిళలు, వైద్యుల సలహా లేకుండా హార్మోన్ల మాత్రలు వాడే వారిలో ఈ ముప్పు మరింత పెరుగుతుంది.

ఏం చేయాలి..?

మహిళా దినోత్సవం సందర్భంగా న్యూరాలజిస్టులు అందిస్తున్న ముఖ్యమైన సలహాలు.. తరచుగా వచ్చే తలనొప్పిని పెయిన్ కిల్లర్లతో తగ్గించుకోవాలని చూడకండి. వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించండి. క్రమబద్ధమైన నిద్ర, వేళకు భోజనం, శరీరానికి సరిపడా నీరు అందేలా చూసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోండి: యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి.  మైగ్రేన్ రావడానికి కారణమయ్యే ఆహార పదార్థాలు లేదా వాసనలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి.

మైగ్రేన్ అనేది కేవలం నొప్పి మాత్రమే కాదు, అది మీ గుండె, మెదడు ఆరోగ్యానికి సంబంధించిన ముందస్తు హెచ్చరిక కావచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే పక్షవాతం వంటి ముప్పులను నివారించవచ్చు.

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..

ఇది కూడా చదవండి..  షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.