చర్మ సంరక్షణ విషయంలో ఇవి తప్పనిసరి..
సాక్షి లైఫ్ : అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ తమ ముఖాన్ని అందంగా మెరిసేలా చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయినా చర్మ సౌందర్యం విషయంలో ఎలాంటి మార్పులు కనిపించకపోవచ్చు.. ఎందుకంటే వాళ్లు కొన్ని తప్పులు చేయడం వల్ల చర్మంపై దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది. అందుకు కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ ఎలాంటి వారికి వస్తుంది..?
నలుపు..
చర్మం నల్లగా మారడానికి అనేక కారణాలు ఉండవచ్చు. అన్నింటిలో మొదటిది, సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన కిరణాలు. ఇవి చర్మాన్ని నల్లగా మారుస్తాయి. అంతే కాకుండా దుమ్ము, కాలుష్యం కారణంగా చర్మం నల్లగా మారుతుంది.
నిద్ర లేకపోవడం..
చాలా మంది అసమతుల్య ఆహారం తీసుకుంటారు. కొంతమంది అతిగా ధూమపానం, మద్యపానం కూడా చేస్తారు. దీని వల్ల కూడా చర్మం పాడైపోయి చర్మం నల్లగా మారడం ప్రారంభమవుతుంది. చాలా సార్లు, నిద్ర లేకపోవడం వల్ల, చర్మం అలసిపోయి నిర్జీవంగా కనిపిస్తుంది.
ఔషధాల దుష్ప్రభావాలు..
ఒక వ్యక్తి ఎక్కువగా ఆందోళన చెందినప్పుడు. శరీరంలో హార్మోన్ల మార్పులు మొదలవుతాయి. ఇది చర్మంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు కొన్ని మందుల దుష్ప్రభావాల వల్ల కూడా చర్మం నల్లగా మారుతుంది.
సన్‌స్క్రీన్‌ని తప్పకుండా అప్లై చేయండి..
ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టినప్పుడల్లా, మీ ముఖం,మెడపై సన్‌స్క్రీన్ రాయండి. ఇది మీ చర్మానికి హాని కలిగించే సూర్య కిరణాలను నివారిస్తుంది. అంతే కాకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు నోరు, ముక్కుకు కాలుష్యంతో కూడిన గాలి తగలకుండా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోండి.
హైడ్రేట్ గా..
రోజంతా కనీసం 8 నుంచి 9 గ్లాసుల నీరు త్రాగాలి. తద్వారా శరీరం హైడ్రేట్ గా ఉండడంతో పాటు చర్మం కూడా హైడ్రేట్ గా ఉంటుంది. రోజంతా ఆరోగ్యకరమైన ఆహారం తినడం ఉత్తమం. అంతేకాకుండా ఆహారంలో పండ్లు, ఆకు కూరలు మొదలైనవాటిని చేర్చుకోవాలి.
సీజన్ ప్రకారం చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి..
ఒత్తిడికి లోనవకండి, ఎక్కువగా ఆందోళన చెందకండి. వీటిని ప్రభావం ఆరోగ్యంపై పడకుండా యోగా, ధ్యానం వంటి ఇతర కార్యకలాపాలను చేయాలి. తద్వారా మనస్సు చాలా ఉత్సాహంగా ఉంటుంది. సీజన్ ను బట్టి చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించాలి.
ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
