Women Above 30 year : 30ఏళ్లు దాటిన మహిళలు ఈ 5 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
సాక్షి లైఫ్ : మహిళల ఆరోగ్యంలో '30' అనేది ఒక కీలకమైన మైలురాయి. సాధారణంగా ఈ వయస్సు తర్వాతే మహిళల్లో ఎముకల సాంద్రత క్రమంగా తగ్గుతూ వస్తుంది. అయితే, చాలామంది మహిళలు కుటుంబ బాధ్యతల్లో పడి తమ శరీరంలో కలిగే మార్పులను గమనించరు. ఈ నిర్లక్ష్యమే కాలక్రమేణా 'ఆస్టియోపొరోసిస్' వంటి తీవ్రమైన ఎముకల వ్యాధులకు దారితీస్తుంది. అందుకే శరీరంలో కాల్షియం తగ్గుతున్నప్పుడు కనిపించే ఈ ప్రాథమిక హెచ్చరికలను గుర్తించడం ఎంతో అవసరం.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
కాల్షియం లోపాన్ని సూచించే ప్రధాన లక్షణాలు..
1. కండరాల నొప్పులు, తిమ్మిర్లు..
నడిచేటప్పుడు లేదా కదిలేటప్పుడు తొడలు, చేతులు, భుజాలలో తరచుగా నొప్పి రావడం కాల్షియం లోపానికి మొదటి సంకేతం. ముఖ్యంగా రాత్రి వేళల్లో కండరాలు పట్టేయడం వంటివి జరుగుతుంటే వెంటనే అప్రమత్తం కావాలి.
2. తీవ్రమైన అలసట, నీరసం..
తగినంత నిద్రపోయినప్పటికీ రోజంతా నీరసంగా అనిపిస్తుందా..? అయితే అది కాల్షియం లోపం వల్ల కావచ్చు. దీనివల్ల ఏ పనిపై ఏకాగ్రత కుదరకపోవడం, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
3. గోళ్ల, చర్మ ఆరోగ్యం..
కాల్షియం తగ్గితే గోళ్లు పలచబడి, త్వరగా విరిగిపోతుంటాయి. అలాగే చర్మం విపరీతంగా పొడిబారడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.
4. దంత సమస్యలు..
మన శరీరంలోని అధిక భాగం కాల్షియం దంతాలు, ఎముకల్లోనే ఉంటుంది. కాల్షియం లోపిస్తే దంతాలు బలహీనపడటం, చిగుళ్ల నొప్పులు, దంత క్షయం వంటి సమస్యలు బాధిస్తాయి.
5. బలహీనమైన ఎముకలు..
చిన్న గాయం తగిలినా ఎముకలు విరగడం లేదా నిరంతరం నడుము, మెడ నొప్పితో బాధపడటం ఆస్టియోపొరోసిస్‌కు దారితీస్తుంది. ఇది ఎముకలను లోపలి నుంచి గుల్లబారేలా చేస్తుంది.
నివారణ మార్గాలు ఏంటి మరి..?
కాల్షియం లోపాన్ని అధిగమించడానికి ఖరీదైన మందుల కంటే సరైన ఆహార నియమాలు పాటించడం ఉత్తమమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. రోజూ కనీసం రెండు గ్లాసుల పాలు లేదా ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. జున్ను (Cheese), మజ్జిగను కూడా డైట్‌లో చేర్చుకోవాలి. పాలకూర, మెంతులు, బ్రోకలీ వంటి కూరగాయలను ఎక్కువగా తినాలి. వీటిలో కాల్షియంతో పాటు శరీరానికి మేలు చేసే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
బాదం, వాల్‌నట్‌లతో పాటు నువ్వులు, చియా గింజలు కాల్షియానికి కేరాఫ్ అడ్రస్. ఒక టీస్పూన్ తెల్ల నువ్వులు తింటే శరీరానికి మంచి కాల్షియం అందుతుంది. మనం ఎంత కాల్షియం తీసుకున్నా, శరీరం దానిని గ్రహించాలంటే విటమిన్ డి అవసరం. అందుకే రోజూ ఉదయం 15-20 నిమిషాలు ఎండలో గడపడం మంచిది.
ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి..?
అతిగా టీ, కాఫీలు తాగడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం నుంచి కాల్షియం బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవాలి. మీలో ఇటువంటి లక్షణాలు తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
