PMOS : పీఎంఓఎస్ను జయించి, 23 కిలోల బరువు తగ్గిన యువతి..!
సాక్షి లైఫ్ : మన శరీరంలో హార్మోన్ల పాత్ర చాలా కీలకం. హార్మోన్ల అసమతుల్యత, జీవక్రియ సమస్యలతో ఇబ్బందిపడే పాలిఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (POMS )అనగానే చాలామంది మహిళలు భయపడతారు. కానీ తాన్యా సింగ్ అనే యువతి ఆ భయాన్ని పక్కనపెట్టి, క్రమశిక్షణతో ఈ సమస్యను అదుపులోకి తెచ్చుకున్నారు. అంతేకాదు 85 కిలోలున్న శరీర బరువును రెండేళ్లలోనే 62 కిలోలకు తగ్గించుకుని, తన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్నారు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
పీఎంఓఎస్ అంటే..?
ఈ సమస్యలో శరీరంలోని హార్మోన్ల పనితీరు గాడి తప్పుతుంది. దీని ప్రభావంతో నెలసరి క్రమం తప్పడం, ఇన్సులిన్‌ను శరీరం సరిగా వినియోగించు కోలేకపోవడం అంటే ఇన్సులిన్ నిరోధకత అంటారు, దీని వల్ల బరువు పెరగడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఒకటి రెండు లక్షణాలకే పరిమితం కాకుండా, శరీర జీవక్రియ మొత్తాన్ని ఇది ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతారు.
తాన్యా ఏం చేశారు..?
మందులపైనే ఆధారపడకుండా జీవనశైలిని సమూలంగా మార్చుకోవడమే తన విజయానికి కీలకమని తాన్యా అనుభవం చెబుతోంది. ఆమె ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి పెట్టారు. సమతుల పోషకాహారం..తీసుకునే ఆహారంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చారు. క్రమం తప్పని వ్యాయామం..రోజువారీ శారీరక శ్రమను అలవాటుగా మార్చుకున్నారు. తగినంత నిద్ర..శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతుంది.
ఒత్తిడి నియంత్రణ..మానసిక ఒత్తిడి తగ్గించుకోవడంపైనా శ్రద్ధ పెట్టారు.
ఈ నాలుగింటినీ పట్టుదలగా పాటించడం వల్ల లక్షణాలు గణనీయంగా అదుపులోకి వచ్చాయని ఆమె చెబుతున్నారు.
ఈ కథ నేర్పే పాఠం..
తాన్యా లో వచ్చిన మార్పు ఒక్క రోజులో వచ్చింది కాదు. రెండేళ్ల నిరంతర కృషి, సడలని సంకల్పం ఫలితమే ఈ మార్పు. పీఎంఓఎస్ ఉందని తెలియగానే నిరాశ చెందాల్సిన అవసరం లేదని, సరైన అలవాట్లతో దాన్ని సమర్థంగా నిర్వహించవచ్చని ఆమె ఉదంతం ధైర్యం ఇస్తోంది.
వేగంగా బరువు తగ్గకూడదు..
వేగంగా బరువు తగ్గాలనే తొందర వద్దు, నెమ్మదిగా, స్థిరంగా తగ్గడమే ఆరోగ్యకరం. ప్రాసెస్ చేసిన, అధిక చక్కెర ఉన్న ఆహారాలను తగ్గించి, పీచు పదార్థాలు, ప్రోటీన్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. నడక, యోగా, శక్తి వ్యాయామాల వంటివి వారంలో చాలా రోజులు చేయడం మంచిది. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. నెలసరి సక్రమంగా లేకపోవడం, అకారణంగా బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
గమనిక: ఇది కేవలంసమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
