Mammogram : మామోగ్రఫీ పరీక్షల గురించి భయాలు ఇక వద్దు..! రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై న్యూ స్టడీ..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అధిక నిర్ధారణ (overdiagnosis) భయం 5 శాతం కంటే తక్కువేపాత అంచనాలను కొట్టేసిన పరిశోధకులున్యూఢిల్లీ: రొమ్ము క్యాన్సర్ ముందస్తు గుర్తింపు కోసం నిర్వహించే 'మామోగ్రఫీ' పరీక్షల గురించి మహిళల్లో ఎన్నో ఏళ్లుగా కొన్ని అపోహలు, భయాలు ఉన్నాయి. ఈ పరీక్షల వల్ల ఎలాంటి హాని చేయని క్యాన్సర్లు కూడా బయటపడతాయని, దీనివల్ల అనవసరమైన ఆందోళన, చికిత్సను ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తుంటారు. అయితే, ఈ భయాలను పటాపంచలు చేస్తూ ఓ తాజా అధ్యయనం సరికొత్త నిజాలను వెలుగులోకి తెచ్చింది. మామోగ్రఫీ ద్వారా జరిగే ఓవర్‌డయాగ్నోసిస్ (overdiagnosis) ప్రమాదం గతంలో చెబుతున్నట్లుగా 30 నుంచి 50 శాతం కాదని, కేవలం 5 శాతం కంటే తక్కువేనని తాజా పరిశోధన స్పష్టం చేసింది.   

అసలు ఓవర్‌డయాగ్నోసిస్ అంటే ఏమిటి..?

 సాధారణ భాషలో చెప్పాలంటే.. ఒక మహిళ శరీరంలో చాలా చిన్న రొమ్ము క్యాన్సర్ కణితి ఉందనుకుందాం. అయితే అది ఎంత నెమ్మదిగా పెరుగుతుందంటే, ఆ మహిళ జీవిత కాలంలో దానివల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా అనారోగ్య సమస్య రాకపోవచ్చు. కానీ, పరీక్షల సమయంలో ఆ కణితిని ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభిస్తే దాన్నే 'ఓవర్‌డయాగ్నోసిస్' అంటారు. అంటే ఇక్కడ వ్యాధి తప్పుగా నిర్ధారణ కావడం కాదు.. ఒకవేళ గుర్తించకపోయినా ఎలాంటి ప్రమాదం లేని సమస్య బయటపడటమే దీని అర్థం.   

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

 

కొత్త అధ్యయనంలో ఏం తేలింది..?

డెన్మార్క్‌లోని 'యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ డెన్మార్క్'తో పాటు పలు ప్రముఖ సంస్థల పరిశోధకులు రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌కు సంబంధించి గతంలో జరిగిన 8 పెద్ద అధ్యయనాలను మరోసారి లోతుగా విశ్లేషించారు. కాల వ్యవధిలో తేడా: స్క్రీనింగ్ ప్రారంభించిన వెంటనే క్యాన్సర్ కేసులు తాత్కాలికంగా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే మామోగ్రఫీ వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడాల్సిన క్యాన్సర్లు ముందే ముందస్తుగా వెలుగులోకి వస్తాయి. పాత అంచనాల్లో లోపం..తగినంత కాలం పాటు పరిశోధన చేయకపోవడం వల్ల.. ప్రారంభంలో కనిపించిన ఈ పెరుగుదలను పాత అధ్యయనాలు పొరపాటున 'ఓవర్‌డయాగ్నోసిస్'గా పరిగణించాయని పరిశోధకులు తేల్చారు. 

ఓవర్‌డయాగ్నోసిస్..

డెన్మార్క్‌లో వేర్వేరు సమయాల్లో ప్రారంభమైన స్క్రీనింగ్ వివరాలను పరిశీలించగా.. వాస్తవ ఓవర్‌డయాగ్నోసిస్ స్థాయి కేవలం 5శాతం లోపే ఉన్నట్లు స్పష్టమైంది. మహిళలు ఏం చేయాలి..? నిపుణుల సలహా ఏంటి..? ఈ కొత్త అధ్యయనం వెలువడినంత మాత్రాన మహిళలు మామోగ్రఫీ పరీక్షలే ఆపేయాలని దీని అర్థం కాదు. ఏ వయస్సులో ఈ పరీక్షలు ప్రారంభించాలి, ఎంత తరచుగా చేయించుకోవాలనేది ఆయా మహిళల వయస్సు, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

సాధారణ స్క్రీనింగ్..

 ఒకవేళ రొమ్ములో గడ్డలు, చర్మంలో మార్పులు లేదా ఇతర అసౌకర్యం ఏమైనా కనిపిస్తే కేవలం సాధారణ స్క్రీనింగ్ తేదీ కోసం ఎదురుచూడకుండా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం. క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం వల్ల లభించే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయని, అనవసర భయాలను వీడి వ్యక్తిగత ఆరోగ్య రిస్క్‌ను బట్టి డాక్టర్ల సలహా మేరకు నడుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.