Swine Flu Dangerous for Pregnant Women : స్వైన్ ఫ్లూ గర్భిణీలకు ప్రమాదకరమా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో స్వైన్‌ఫ్లూ (H1N1) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణ వ్యక్తుల కంటే గర్భిణులపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా కేసులు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న ఇన్‌ఫ్లుయెంజా-ఎ కేసుల్లో సుమారు 98 శాతం వరకు హెచ్1ఎన్1 స్ట్రెయిన్ కారణంగానే వస్తున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ICMR) వెల్లడించింది.

 

ఇది కూడా చదవండి..క్రానిక్ సైనసిటిస్ కు అక్యూట్ సైనసిటిస్ తేడా ఏంటి..?

ఇది కూడా చదవండి..నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

ఇది కూడా చదవండి..జన్యుపరమైన సమస్యలను ఏవిధంగా అధిగమించాలంటే..?

 

వైరస్ వ్యాప్తి - తాజా పరిస్థితి..

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా కేసులు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న ఇన్‌ఫ్లుయెంజా-ఎ కేసుల్లో సుమారు 98 శాతం వరకు హెచ్1ఎన్1 స్ట్రెయిన్ కారణంగానే వస్తున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ICMR) వెల్లడించింది. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారితో పాటు గర్భిణులకు ఈ ఇన్ఫెక్షన్ వల్ల అధిక ముప్పు పొంచి ఉంది.

గర్భిణులకు పొంచి ఉన్న ముప్పు..

గర్భధారణ సమయంలో శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మరియు హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల వైరస్ తీవ్రత త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. సాధారణ జలుబు, దగ్గుతో మొదలై అధిక జ్వరం, తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు, న్యుమోనియా వంటి తీవ్ర సమస్యలకు దారితీయవచ్చు.

పిండం ఎదుగుదలపై ప్రభావం..

తీవ్రమైన జ్వరం (100.4°F కంటే ఎక్కువ) గర్భస్థ శిశువు నాడీ వ్యవస్థ, గుండె సంబంధిత ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, డీహైడ్రేషన్ వల్ల నెలలు నిండకుండానే కాన్పు కావడం (preterm labor) లేదా కడుపులోని బిడ్డకు ఆక్సిజన్ అందకపోవడం (fetal distress) జరగవచ్చు. గర్భం దాల్చిన రెండో, మూడో త్రైమాసికం (2nd, 3rd Trimester) లో ఉన్నవారికి, ప్రసవం జరిగిన మొదటి రెండు వారాల వరకు ఈ సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

నిపుణుల సూచనలు-జాగ్రత్తలు..

వైద్యుల సలహాతో గర్భధారణ సమయంలో ఇన్‌ఫ్లుయెంజా టీకా తీసుకోవడం వల్ల తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా తొలి నెలల్లో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోవడం, దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ముక్కు, నోటికి రుమాలు అడ్డుపెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.

రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడం, జలుబు లేదా జ్వరం లక్షణాలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆస్తమా, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అధిక జ్వరం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఇంట్లోనే వేచి చూడకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

ఇది కూడా చదవండి.. గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

ఇది కూడా చదవండి..స్పాండిలోసిస్ సమస్యలు - పరిష్కార మార్గాలు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.