Health Effects of Menopause మెనోపాజ్ తర్వాత మహిళల ఆరోగ్యంపై పడే ప్రభావాలు ఇవే..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మహిళల్లో వరుసగా 12 నెలల పాటు రుతుక్రమం పూర్తిగా ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. భారతదేశంలో సాధారణంగా 45 నుంచి 50 ఏళ్ల వయసులో వచ్చే ఈ దశలో, అండాశయాల నుంచి ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల స్థాయిలు గణనీయంగా పడిపోతాయి. దీనివల్ల కేవలం పీరియడ్స్ ఆగిపోవడమే కాకుండా, శరీరంలో అనేక దీర్ఘకాలిక మార్పులు చోటుచేసుకుంటాయి.

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

హాట్ ఫ్లాషెస్, నిద్రలేమి..

 అకస్మాత్తుగా శరీరంలో వేడి ఆవిర్లు రావడం, విపరీతంగా చెమటలు పట్టడాన్ని 'హాట్ ఫ్లాషెస్' అంటారు. కొన్ని సెకన్ల నుంచి నిమిషాల పాటు ఉండే ఈ సమస్య రాత్రిపూట వస్తే నిద్రకు తీవ్ర ఆటంకం కలుగుతుంది.

ఎముకల బలహీనత (Osteoporosis)..


ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల కొత్త ఎముకలు ఏర్పడే వేగం తగ్గి, అరుగుదల వేగవంతం అవుతుంది. దీనివల్ల ఎముకలు పెళుసుగా మారి త్వరగా విరిగే ప్రమాదం ఉంటుంది. యోని చర్మం, కణజాలాల్లో మార్పుల వల్ల పొడిబారడం, మంట, దురద లేదా కలయిక సమయంలో నొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే పదేపదే మూత్రం రావడం, మూత్రాన్ని ఆపుకోలేకపోవడం, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల ముప్పు కూడా పెరుగుతుంది.

కండరాల బలం తగ్గిపోయి, నడుము చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. మెనోపాజ్ తర్వాత మహిళల్లో గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. హార్మోన్ల అసమతు ల్యత వల్ల మూడ్ స్వింగ్స్, చిరాకు, జ్ఞాపకశక్తి లేదా ఏకాగ్రత లోపించడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమస్యల తీవ్రతను తగ్గించుకోవడానికి క్యాల్షియం, విటమిన్-డి పుష్కలంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువును అదుపులో ఉంచుకోవడం అత్యంత అవసరం.

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.