Skin care tips : ఓట్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం..! ఈ సులభమైన ఫేస్‌ప్యాక్‌లను ట్రై చేసి చూడండి..
సాక్షి లైఫ్ : అందమైన, మచ్చలు లేని, కాంతివంతమైన చర్మం కావాలని ఎవరికి ఉండదు? దీని కోసం చాలామంది మార్కెట్లో లభించే ఖరీదైన సౌందర్య సాధనాలు, బ్యూటీ ట్రీట్‌మెంట్‌లను ఆశ్రయిస్తుంటారు. అయితే, మన వంటింట్లో లభించే సహజ సిద్ధమైన పదార్థాలతో కూడా అద్భుతమైన మెరుపును పొందవచ్చు. అలాంటి వాటిలో 'ఓట్స్' ఒకటి. ఓట్స్ అనగానే కేవలం ఆరోగ్యకరమైన టిఫిన్ మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ, ఇది చర్మ సంరక్షణలోనూ అద్భుతంగా పనిచేస్తుంది.
ఓట్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి లోతైన పోషణను అందిస్తాయి. చర్మంపై ఉండే మృతకణాలను తొలగించడంలో, అధిక జిడ్డును నియంత్రించడంలో, పొడిబారడాన్ని తగ్గించడంలో ఓట్స్ ఎంతగానో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?
ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?
ఓట్స్‌తో 3 సులభమైన ఫేస్‌ప్యాక్‌లు..
1. ఓట్స్ - హనీ ఫేస్‌ప్యాక్.. పొడి చర్మం కోసం..
మీ చర్మం పొడిగా, కాంతిహీనంగా కనిపిస్తుంటే ఈ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. రెండు చెంచాల ఓట్స్ పొడిలో ఒక చెంచా తేనె కలిపి చిక్కని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇది చర్మానికి మంచి తేమను అందించి మెత్తగా మారుస్తుంది.
2. ఓట్స్ - కర్డ్ స్క్రబ్ .. మృతకణాలు తొలగించడానికి..
చర్మంపై పేరుకుపోయిన మురికి, మృతకణాలను తొలగించడానికి ఈ మిశ్రమం బెస్ట్ ఆప్షన్. ఒక చెంచా ఓట్స్‌కు రెండు చెంచాల తాజా పెరుగు కలిపి ముఖంపై 2 నుంచి 3 నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత 10 నిమిషాలు ఉంచి కడిగేయాలి. ఇది చర్మాన్ని క్లీన్‌గా, ఫ్రెష్‌గా ఉంచుతుంది.
3. ఓట్స్, పాలు, రోజ్ వాటర్.. కాంతివంతమైన మెరుపు కోసం..
చర్మం సహజ సిద్ధంగా మెరవాలంటే ఓట్స్ పొడిలో కొద్దిగా పచ్చిపాలు, కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. దీనిని ముఖం, మెడ భాగంలో రాసి 15 నిమిషాల తర్వాత మామూలు నీటితో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా వాడితే చర్మం తాజాదనంతో కాంతివంతంగా కనిపిస్తుంది. వాడుకలో తీసుకోవా ల్సిన జాగ్రత్తలు..ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
ఎలాంటి హోమ్ రెమెడీనైనా ప్రయత్నించే ముందు ప్యాచ్ టెస్ట్ అంటే చేతిపై చిన్నగా రాసి సరిచూసుకోవడం మంచిది. ముఖంపై గట్టిగా రుద్దకూడదు. దీనివల్ల చర్మం ఎర్రబడి మంట పుట్టే అవకాశం ఉంటుంది. ఓట్స్ ప్యాక్‌లను వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ చర్మానికి పడకపోయినా, మంట లేదా అలర్జీ అనిపించినా వెంటనే వాడటం ఆపివేసి డెర్మటాలజిస్ట్ ల సలహా తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం..
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
