IVF : సంతాన సాఫల్యతలో నయా ట్రెండ్: ఏఐ, ఆధునిక సాంకేతికతతో మెరుగైన ఐవీఎఫ్ ఫలితాలు..
సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం వంటి కారణాల వల్ల నేడు సంతానలేమి (Infertility) అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య, సామాజిక సమస్యగా మారుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది దంపతులకు 'ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్' (ఐవీఎఫ్ - IVF) ఒక ఆశాకిరణంగా నిలుస్తోంది. ఒకప్పుడు సాధారణ పద్ధతుల్లో జరిగే ఈ చికిత్సలోకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అధునాతన డయాగ్నస్టిక్స్ రంగ ప్రవేశం చేయడంతో విజయవకాశాలు గణనీయంగా పెరిగాయి.
ఐవీఎఫ్ చికిత్సలో వచ్చిన విప్లవాత్మక మార్పులు..
గతంలో ఐవీఎఫ్ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటమే కాకుండా సక్సెస్ రేటు కూడా తక్కువగా ఉండేది. కానీ నేటి ఆధునిక వైద్యం ఆ లోపాలను అధిగమించింది.
అండాశయాల ప్రేరణ (Ovarian Stimulation)..
గతంలో కేవలం 2D స్కానింగ్ ద్వారా అండం ఎదుగుదలను అంచనా వేసేవారు. ఇప్పుడు హై-రిజల్యూషన్ మైక్రోస్కోప్‌లు, ఏఐ సాయంతో కచ్చితంగా పర్యవేక్షిస్తూ, అండాశయ హైపర్-స్టిమ్యులేషన్ (OHSS) వంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందుల మోతాదును నిర్ణయిస్తున్నారు.
నొప్పి లేని అండాల సేకరణ (Egg Retrieval)..
ఒకప్పుడు కోతతో కూడిన శస్త్రచికిత్స అవసరమయ్యేది. కానీ ఇప్పుడు తేలికపాటి మత్తుమందు ఇచ్చి, ట్రాన్స్‌వజైనల్ అల్ట్రాసౌండ్ ద్వారా సురక్షితంగా, నొప్పిలేకుండా అండాలను బయటకు తీస్తున్నారు.
మెరుగైన ఫలదీకరణ (Fertilization): సాధారణ పెట్రీ డిష్‌లకు బదులుగా ఇప్పుడు 'టైమ్-లాప్స్ ఇంక్యుబేటర్ల'ను వాడుతున్నారు. ఇవి ప్రతి 10 నుంచి 20 నిమిషాలకూ పిండం ఫొటోలు తీస్తాయి. అదనంగా IMSI వంటి విధానాలతో నాణ్యమైన వీర్యకణాన్ని ఎంపిక చేస్తున్నారు.
ముందస్తు జన్యు పరీక్షలు (Pre-Implantation)..
గర్భస్రావాలను అరికట్టేందుకు ఇప్పుడు PGT (జన్యు పరీక్ష), ERA (గర్భాశయ పొర సంసిద్ధతను తెలిపే పరీక్ష) వంటి అధునాతన పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పిండం ఆరోగ్య స్థితిని ముందుగానే చెబుతాయి.
కచ్చితమైన పిండ బదిలీ (Embryo Transfer): గతంలో అంచనాతో పిండాన్ని ప్రవేశపెట్టేవారు. ప్రస్తుతం అల్ట్రాసౌండ్-గైడెడ్ (UGET), క్రయోప్రిజర్వేషన్ టెక్నాలజీతో సరైన సమయంలో, కచ్చితమైన ప్రదేశంలో గర్భాశయంలోకి పిండాన్ని ప్రవేశపెడుతున్నారు.
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
విస్తరిస్తున్న ఐవీఎఫ్ సేవలు..
భారతదేశంలో సుమారు 2.8 కోట్ల మంది మహిళలు సంతానలేమితో బాధపడుతున్నారని అంచనా. కానీ, దేశవ్యాప్తంగా ఏటా కేవలం 2.5 లక్షల నుంచి 3 లక్షల ఐవీఎఫ్ సైకిల్స్ మాత్రమే జరుగుతున్నాయి. దేశంలో 4,281 రిజిస్టర్డ్ ఏఆర్‌టీ (ART) క్లినిక్‌లు ఉన్నప్పటికీ, డిమాండ్‌కు తగినట్లు సేవలు ఇంకా విస్తరించాల్సి ఉంది. ఈ పెరుగుతున్న అవసరాల దృష్ట్యా, 2034 నాటికి దేశీయ ఐవీఎఫ్ మార్కెట్ విలువ 4 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
