Cervical Cancer : సర్వైకల్ క్యాన్సర్ : ఈ రెండు పరీక్షలతో ముప్పునకు చెక్..! ప్రతి మహిళా తెలుసుకోవాల్సిన విషయాలివే..
సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా మహిళలను భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధుల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) ఒకటి. ఏటా లక్షలాది మంది మహిళలు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, సకాలంలో గుర్తిస్తే ఈ క్యాన్సర్‌ను పూర్తిగా అరికట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాధి ముదిరే వరకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలామంది మహిళలు ప్రమాదంలో పడుతున్నారు.
పెళ్లికి ముందే హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ ముప్పును చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీనితో పాటు, ప్రతి మహిళా క్రమం తప్పకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. ఆ రెండు ముఖ్యమైన పరీక్షలు ఏమిటో, అవి ఎలా సహాయపడతాయో ఇక్కడ తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ప్యాప్ స్మియర్ టెస్ట్ (Pap Smear Test)..
హెచ్‌పీవీ పరీక్ష, ప్యాప్ స్మియర్ పరీక్ష రెండూ ఒకటే అని చాలామంది పొరబడుతుంటారు. కానీ ప్యాప్ స్మియర్ అనేది కణాల్లోని మార్పులను పసిగట్టే పరీక్ష. ఈ పరీక్షలో గర్భాశయ ముఖద్వారం (cervix) నుంచి కొన్ని కణాల నమూనాను సేకరించి ల్యాబ్‌కు పంపుతారు. కణాల్లో ఏవైనా అసాధారణ మార్పులు జరుగుతున్నాయా..? భవిష్య త్తులో అవి క్యాన్సర్‌గా మారే ముప్పు ఉందా..? అనేది ఈ పరీక్ష ద్వారా తెలుస్తుంది. 21 నుంచి 65 ఏళ్ల లోపు మహిళలందరూ క్రమం తప్పకుండా ఈ పరీక్ష చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే, వైద్యుల సలహాతో మరింత అప్రమత్తంగా ఉండాలి.
హెచ్‌పీవీ టెస్ట్ (HPV Test)..
గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన 'హ్యూమన్ పాపిలోమా వైరస్' (HPV) శరీరంలో ఉందో లేదో ఈ పరీక్ష ద్వారా గుర్తిస్తారు. హై-రిస్క్ హెచ్‌పీవీ వైరస్ దీర్ఘకాలం పాటు శరీరంలో ఉంటే, అది సెర్వికల్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఈ వైరస్ వ్యాప్తిని, క్యాన్సర్ ముప్పును అడ్డుకునేందుకు ముందస్తుగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం.
ఈ పరీక్షలు ఎందుకు అవసరం..?
సర్వైకల్ క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలాంటి నొప్పులు లేదా లక్షణాలు బయటపడవు. ఈ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రం కాకముందే గుర్తించి అడ్డుకోవచ్చు. హెచ్‌పీవీ లేదా ప్యాప్ స్మియర్ పరీక్షల్లో 'పాజిటివ్' లేదా 'అసాధారణ మార్పులు' కనిపించినంత మాత్రాన మీకు క్యాన్సర్ ఉన్నట్లు కాదు. భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని దానికి అర్థం. ఇలాంటి సమయంలో వైద్యుల సూచన మేరకు కొల్పోస్కోపీ లేదా బయాప్సీ వంటి తదుపరి పరీక్షలు చేయించుకుని, సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి సులభంగా బయటపడవచ్చు.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
