జుట్టు రాలకుండా హోమియోపతిలో చికిత్స ఉందా..?  

సాక్షి లైఫ్ : జుట్టు రాలడానికి ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి. మొదటి కారణం హార్మోన్ల మార్పులు.. హెయిర్ ఫాల్ అనేది హార్మోన్ల మార్పుల వల్ల కూడా తలెత్తుతుందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. రెండవది కొన్ని తీవ్రమైన వ్యాధులు లేదా వైద్య పరిస్థితుల కారణంగా కూడా జుట్టు రాలడం జరుగుతుంది.

మరికొందరిలో పోషకాహార లోపం..

మూడవది వంశపారంపర్యంగా కూడా హెయిర్ ఫాల్ సంభవిస్తుందని డాక్టర్లు అంటున్నారు. నాల్గవ కారణం వయస్సు పెరగడంతో చాలామంది శారీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అందులో భాగంగా జుట్టు రాలుతుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మరికొందరిలో పోషకాహార లోపం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తలెత్తవచ్చని వారు చెబుతున్నారు.    

మానసిక ఒత్తిడి.. 

 జుట్టు రాలడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోవడం, ఆందోళన, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు దారి తీస్తుంది. రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సర్వసాధారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ ఎవరికైనా హెయిర్ ఫాల్ సమస్య ఉన్నప్పుడు, రోజుకు సగటున 100 వెంట్రుకలకు పైగా రాలుతాయట. ఇంతపెద్ద మొత్తంలో వెట్రుకలు రాలితే హెయిర్ ఫాల్ గా భావిస్తామని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

 వెంట్రుకలు సన్నగా కనిపించడం, కొత్త వెంట్రుకలు అస్సలు పెరగనప్పుడు ఈ సమస్య ఆందోళనకరంగా మారుతుంది. జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి, ముందుగా మీ ఆహారంపై శ్రద్ధ వహించాలని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఆరోగ్యకరమైన జుట్టు కోసం, మీ రోజువారీ ఆహారంలో కొన్ని పోషకాలను తప్పనిసరిగా చేర్చుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. 

64శాతంమంది భారతీయులు.. 

పలు పరిశోధనల ప్రకారం 64శాతంమంది భారతీయులు జుట్టు రాలు సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు ఒత్తిడి, కాలుష్యం, నీటి నాణ్యత తక్కువగా ఉండటం. జుట్టు రాలు సమస్యను నియంత్రించడానికి, కొందరు పలురకాల నూనె లు ,షాంపూలు వంటివి వినియోగిస్తుంటారు. ఈ సమస్యను నియంత్రించడంలో సహాయపడటానికి, బట్టతల (అలోపేసియా), హైపోట్రికోసిస్, జుట్టు రాలడానికి సంబంధించిన ఇతర సమస్యలకు చికిత్స చేయడంలో హోమియోపతి వైద్య విధానంలో  మంచి ఫలితాలు పొందవచ్చని హోమియోపతి వైద్యనిపుణులు చెబుతున్నారు. 

హెయిర్ ఫాల్ సమస్యకు హోమియోపతి చికిత్స.. 

- జుట్టు రాలు సమస్యకు అందించే చికిత్సలో హోమియోపతి వైద్య విధానం ఒక వరం అని రుజువు అయ్యింది. అది కూడా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా. సంప్రదాయ చికిత్సల వలె కాకుండా జుట్టు రాలడం సమస్యలు పునరావృతమయ్యే ప్రమాదాన్ని తొలగిస్తాయి.

హోమియోపతి మందులు సహజంగా రసాయనాలు,స్టెరాయిడ్లు లేకుండా తయారు చేస్తారు. హోమియోపతి వైద్యంలో జుట్టు రాలడానికి గల మూల కారణాన్ని గుర్తించి అందుకు తగిన పరిష్కారాన్ని అందిస్తారు. జుట్టు రాలడానికి గల అంతర్లీన కారణాన్ని బట్టి హెయిర్ కేర్ తీసుకుంటారు.

 ప్రయోజనం ఏమిటంటే..? 

ఇప్పటికే ఉన్న లక్షణాలపై దృష్టి పెట్టడమే కాకుండా, రోగులకు సంబంధించిన పలు అంశాలను బట్టి జుట్టు రాలిపోవడానికి కారణాలు, వైద్య చరిత్రను విశ్లేషించి, మానసిక,శారీరక స్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు హోమియోపతి మందులను సూచిస్తారు. 

ఈ మందులు జుట్టు మూలాలకు పోషణను అందిస్తాయి. అప్పుడు సమస్యకు సరైన పరిష్కారం అంది జుట్టు పెరుగుతుంది. హెయిర్ ఫాల్ అనేది కొందరిలో వయస్సు పరిమితి లేదు. ఐరోపాలోని స్కిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసిన ఒక అధ్యయనంలో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా డైహైడ్రోటెస్టోస్టెరాన్ (డీహెచ్ టీ)ని ఎదుర్కోవడంలో హోమియోపతి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది.

 జుట్టు రాలడానికి కారణమయ్యే హార్మోన్..

డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనే హార్మోన్  జుట్టు రాలడానికి కారణమయ్యే ఒక రకమైన హార్మోన్. పురుష జీవ లక్షణాల అభివృద్ధికి ఇది చాలా ముఖ్యమైంది. కానీ ఒక్కోసారి అధిక స్థాయిలో ఉత్పత్తి అయినప్పుడు, డీహెచ్ టీ అణువులు వెంట్రుకల ఎదుగుదలను ఆపేస్తాయి. వెంట్రుక కణాల రక్త సరఫరాను అడ్డుకుంటాయి. అలాంటి వాటిని హోమియోపతి వైద్యం ద్వారా నియంత్రించవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.   

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : hair-fall-problem

Related Articles

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com