Hyperpigmentation : హైపర్‌పిగ్మెంటేషన్ సమస్య ఎందుకు తలెత్తుతుంది..? దానిని ఎలా నివారించాలి..?
సాక్షి లైఫ్ : సమ్మర్ కేవలం ఎండలనే కాదు.. అనేక చర్మ సంబంధిత సమస్యలను కూడా వెంటబెట్టుకొస్తుంది. వీటిలో ప్రధానంగా వేధించే సమస్య 'హైపర్‌పిగ్మెంటేషన్'. చర్మంలోని కొన్ని భాగాలు సాధారణ రంగు కంటే ముదురు రంగులోకి మారడాన్నే 'హైపర్‌పిగ్మెంటేషన్' అంటారు. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ ఈ సమస్య ఎందుకు పెరుగుతుంది..? అసలు ఈ సమస్య నుంచి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి..? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారు.
ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఏమిటీ హైపర్‌పిగ్మెంటేషన్..?
మన శరీరంలో 'మెలనిన్' అనే వర్ణద్రవ్యం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల చర్మంపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ముఖం, మెడ, చేతులపై ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. వేసవిలో సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన యూవీ (UVA, UVB) కిరణాలు చర్మంలోని మెలనోసైట్‌లను ప్రేరేపించడం వల్ల ఈ మచ్చలు మరింత గాఢంగా మారుతాయి.
సమస్యకు ప్రధాన కారణాలివే..
అధికంగా చెమట పట్టడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఇది చర్మం నల్లబడటానికి దారితీస్తుంది. మహిళల్లో గర్భధారణ సమయంలో లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే 'మెలస్మా' వంటి సమస్యలు ఎండ ప్రభావంతో మరింత తీవ్రమవుతాయి.వేడి వల్ల చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. చనిపోయిన కణాలు పేరుకుపోవడం వల్ల చర్మం రంగు మారుతుంది. ఆల్కహాల్ ఎక్కువగా ఉండే టోనర్లు, కఠినమైన కెమికల్స్ ఉన్న క్రీములు వాడటం వల్ల చర్మం దెబ్బతిని పిగ్మెంటేషన్ పెరుగుతుంది.
నివారణా మార్గాలు ఏమిటి..?
ఎండలో వెళ్లేవారు కనీసం SPF 30+ లేదా 50+ ఉన్న సన్‌స్క్రీన్‌ను రాసుకోవాలి. ఇంట్లో ఉన్నా సరే, ప్రతి 3 నుంచి 4 గంటలకు ఒకసారి దీనిని అప్లై చేయడం వల్ల సూర్యకిరణాల నుంచి రక్షణ లభిస్తుంది.
విటమిన్ సి పొందడానికి నారింజ, ఉసిరి, నిమ్మ తీసుకోవాలి. విటమిన్ "ఇ" బాదం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి చర్మాన్ని రక్షిస్తాయి. చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. అలోవెరా జెల్ లేదా హైలురోనిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్లు వాడటం మంచిది. ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ ప్యాక్ లేదా పెరుగు-పసుపు మిశ్రమాన్ని వాడటం వల్ల మచ్చలు తగ్గుతాయి. బొప్పాయి, తేనె మిశ్రమం కూడా చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది.
మచ్చలు మరీ ఎక్కువగా ఉన్నట్లయితే సొంత ప్రయోగాలు చేయకుండా చర్మవ్యాధి నిపుణులను (Dermatologist) సంప్రదించాలి. మైక్రోడెర్మాబ్రేషన్, లేజర్ థెరపీ వంటి ఆధునిక చికిత్సల ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు.
ఇది కూడా చదవండి..ఈ 5 సప్లిమెంట్స్ కు డబ్బు దండగ అంటున్న వైద్యనిపుణులు..!
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
