Summer Sleep: వేసవికాలంలో నిద్ర తగ్గడానికి కారణాలు ఏంటి..?
సాక్షి లైఫ్ : వేసవి కాలంలో పగటి సమయం పెరగడం, ఉష్ణోగ్రతలు గరిష్ఠానికి చేరడంతో చాలామంది నిద్రలేమితో సతమతమవుతూ ఉంటారు. శీతాకాలంతో పోలిస్తే వేసవికాలంలో నిద్ర తక్కువగా ఉండటం వల్ల చిరాకు, అలసట, మానసిక ఒత్తిడి పెరుగుతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రశాంతమైన నిద్ర కోసం జీవ గడియారాన్ని (Biological Clock) ఎలా క్రమబద్ధీకరించుకోవాలో వైద్యులు వివరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..Ajna Chakra : ఆజ్ఞా చక్రం శక్తిని పెంచడానికి ఏ యోగా సాధనలు చేయాలి..?
ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్..
నిద్ర తగ్గడానికి ప్రధాన కారణమేంటి..?
మన శరీరంలో నిద్రను ప్రేరేపించే 'మెలటోనిన్' అనే హార్మోన్ ఉత్పత్తి కాంతిపై ఆధారపడి ఉంటుంది. వేసవిలో సూర్యాస్తమయం ఆలస్యంగా కావడంతో చీకటి పడే వరకు ఈ హార్మోన్ విడుదల కాదు. దీనివల్ల నిద్ర చక్రం దెబ్బతింటుంది. బెర్లిన్‌లోని సెయింట్ హెడ్విగ్ ఆసుపత్రి అధ్యయనం ప్రకారం.. సూర్యరశ్మి ప్రభావంతో మన శరీరంలోని 24 గంటల జీవ గడియారం మారుతూ ఉంటుంది. అందుకే వేసవిలో ఆలస్యంగా పడుకున్నా, సూర్యోదయం త్వరగా కావడంతో మేల్కొనాల్సి వస్తుంది. ఫలితంగా శరీరానికి అవసరమైన 7 నుంచి 8 గంటల నిద్ర పట్టదు.
సుఖ నిద్రకు నిపుణులు సూచించే సూచనలు..
పడుకునే గదిని చల్లగా, నిశ్శబ్దంగా ఉంచుకోవాలి. గదిలో చీకటిగా ఉంటే మెలటోనిన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. నిద్రపోవడానికి కనీసం గంట ముందే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లకు దూరంగా ఉండాలి.
రాత్రిపూట భోజనం కొంచెం తగ్గించాలి. పడుకునే ముందు టీ, కాఫీలు తాగకూడదు. పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేసి, సౌకర్యవంతమైన కాటన్ దుస్తులు ధరించాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. నిద్ర వచ్చినప్పుడు మాత్రమే మంచంపైకి చేరాలి. తగినంత శారీరక శ్రమ చేస్తూ, సహజ సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి వల్ల నిద్రను పణంగా పెట్టడం ఆరోగ్యానికి చేటు. మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి వేసవిలోనూ తగినంత విశ్రాంతి తప్పనిసరని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?
ఇది కూడా చదవండి..Betel Leaves Help Reduce Cholesterol : తమలపాకు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..??
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
