Bird Flu Impact : చెన్నైలో1500 కాకులు మృతి..! బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్..
సాక్షి లైఫ్ : ఇప్పటివరకు పలు రాష్ట్రాలను వణికించిన బర్డ్ ఫ్లూ తమిళనాడు రాజధాని చెన్నైలో బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా) పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 1,500కు పైగా కాకులు అకస్మాత్తుగా మృతి చెందడం స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా అడయార్, వేలచ్చేరి, పల్లికరణై వంటి ప్రాంతాల్లో కాకులు పెద్ద సంఖ్యలో నేలకొరుగుతున్నాయి. వీటి నమూనాలను భోపాల్‌లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్‌కు పంపగా, అక్కడ H5N1 వైరస్‌గా నిర్ధారణ అయింది.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..Health care : అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందించే చెర్రీస్..
కేంద్రం హై అలర్ట్..
ఈ పరిణామంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని తమిళనాడు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. పౌల్ట్రీ ఫారాలు, పక్షుల విక్రయ కేంద్రాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించింది. కేరళ, బీహార్ వంటి రాష్ట్రాల్లోనూ ఇప్పటికే ఈ కేసులు వెలుగుచూడటంతో సరిహద్దు జిల్లాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.
ప్రజలకు సూచనలు..
ఎక్కడైనా పక్షులు చనిపోయి కనిపిస్తే వాటిని నేరుగా చేతులతో తాకకూడదు. వెంటనే స్థానిక మున్సిపల్ లేదా పశువైద్య అధికారులకు సమాచారం అందించాలి. పక్షుల మృతదేహాలను కనీసం 8 అడుగుల లోతులో పూడ్చివేయాలని లేదా దహనం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. బాధితుల్లో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చికెన్, గుడ్లను అధిక ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఈ వైరస్ మనుషులకు సోకడం చాలా అరుదని, అయితే అప్రమత్తంగా ఉండటం అత్యవసరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని తమిళనాడు ఆరోగ్య మంత్రి మా.సుబ్రమణియన్ కోరారు.
ఇది కూడా చదవండి..Prediabetes : ప్రీడయాబెటిస్ కు గుండె జబ్బుల ప్రమాదానికి లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..Methi side effects : మెంతులు ఎక్కువగా తీసుకున్నా సమస్యే..
ఇది కూడా చదవండి..For stress less life : మెంటల్ స్ట్రెస్ తగ్గించే ఆరోగ్యకరమైన నియమాలు
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
