Stem Cell Therapy : మోకాళ్ల మార్పిడికి చెక్.. : నిమ్స్‌లో స్టెమ్ సెల్ థెరపీ పరిశోధన కేంద్రం
సాక్షి లైఫ్ : నిమ్స్ ఆసుపత్రిలో వైద్య రంగంలో మరో కీలక అడుగు పడనుంది. అత్యాధునిక 'మూలకణ చికిత్స' (Stem Cell Therapy) పరిశోధన కేంద్రాన్ని సోమవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన బయోటెక్ స్టార్టప్ 'తులసి థెరప్యూటిక్స్' భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
పునర్జీవం పోసే ప్రక్రియ..
మూలకణ చికిత్సను ‘రీ-జనరేటివ్ మెడిసిన్’ అని కూడా పిలుస్తారు. ఈ చికిత్సలో భాగంగా రోగి లేదా దాత శరీరంలోని ఎముక మజ్జ, బొడ్డు తాడు, కొవ్వు కణజాలం నుంచి మూలకణాలను సేకరిస్తారు. వీటిని ప్రయోగశాలలో అభివృద్ధి చేసి, నేరుగా వ్యాధి సోకిన ప్రాంతంలోకి ఇంజెక్ట్ చేస్తారు. దెబ్బతిన్న కణాలను ఇవి మరమ్మత్తు చేయడమే కాకుండా, కొత్త కణాలను ఉత్పత్తి చేసి అవయవ పనితీరును మెరుగుపరుస్తాయి.
అనేక వ్యాధులకు సరైన పరిష్కారం లభించే అవకాశం..
ఈ పరిశోధనలు విజయవంతమైతే భవిష్యత్తులో పలు రకాల మొండి వ్యాధులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. అటువంటి వాటిలో ప్రధానంగా రక్త సంబంధితవ్యాధులు..అంటే..? లుకేమియా, లింఫోమా, మైలోమా వంటి వ్యాధులకు చికిత్స అందించడానికి వీలవుతుంది.
పార్కిన్సన్, అల్జీమర్స్, డయాబెటిస్, వెన్నెముక గాయాలకు చికిత్స చేసే అవకాశం ఉంది. మోకాళ్ల చికిత్సలో ఈ విధానం అందుబాటులోకి వస్తే, శస్త్రచికిత్స (Replacement) అవసరం లేకుండానే ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
పేదలకు అండగా..
ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల రూపాయలతో కూడుకున్న ఈ చికిత్సను, నిమ్స్‌లో అత్యంత తక్కువ ధరకే పేదలకు అందించడమే లక్ష్యమని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప నగిరి తెలిపారు. అమెరికా నుంచి అత్యుత్తమ సాంకేతికతను తులసి సంస్థ ఇక్కడకు తీసుకువస్తోంది. ఎథిక్స్ కమిటీ అనుమతి పొందిన తర్వాత త్వరలోనే రోగులకు పూర్తిస్థాయిలో ఈ చికిత్స అందుబాటులోకి రానుంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
