చెరకు రసం ఎక్కువగా తాగుతున్నారా..?   

షేర్ చేయండి:
చెరకు రసం ఎక్కువగా తాగుతున్నారా..?   

సాక్షి లైఫ్ : ఎండాకాలంలో ఇంట్లోంచి బయటికి రాగానే లిక్విడ్ ఫుడ్స్‌పై మోజు మొదలవుతుంది. కొంతమంది లిక్విడ్ ఫుడ్స్‌లో చెరుకు రసం తాగడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చల్లటి చెరకు రసం శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. వేడి నుంచి ఉపశమనాన్ని కూడా అందిస్తుంది. అయితే చెరుకు రసంలో ఉండే చక్కెరశాతం మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా..?

ఇది కూడా చదవండి.. యునాని ఔషధాలు ఎలా పనిచేస్తాయి..?  

చెరకు రసం..

100 ఎంఎల్ చెరకు రసంలో13-15 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది అధిక చక్కెర స్థాయిని కలిగి ఉంటుంది, కాబట్టి దాని వినియోగాన్ని తగ్గించాలి. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి 30 గ్రాముల చక్కెర అవసరం, అంటే మీరు రోజుకు రెండు గ్లాసుల చెరకు రసం తాగితే, మీరు మీ రోజువారీ అవసరాల కంటే ఎక్కువ చక్కెరను తీసుకున్నట్లే. 

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్..

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, మీరు చెరకు రసాన్ని తాగాలనుకుంటే 7 నుంచి 10 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు కూడా చక్కెరను పరిమితం చేయాలనిICMR సూచించింది. ఈ వయస్సు పిల్లలు 24 గ్రాముల చక్కెర మాత్రమే తీసుకోవాలని ICMR వెల్లడించింది. 

ఇది కూడా చదవండి.. మల్టిపుల్ స్క్లెరోసిస్ వ్యాధి లక్షణాలు..? 

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.