Ayushman Bharat Services : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘ఆయుష్మాన్ భారత్’ సేవల విస్తరణ..! 23 నుంచి 112కు పెరగనున్న మెడికల్ ప్యాకేజెస్..
సాక్షి లైఫ్ : రోగులకు స్థానికంగానే మెరుగైన చికిత్స అందించేందుకు కేంద్రం కసరత్తుదిల్లీ: పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే కేటాయించిన వైద్య ప్యాకేజీల సంఖ్యను భారీగా పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 23 ప్యాకేజీలను ఏకంగా 112కు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
దూర ప్రాంతాలకు వెళ్లే శ్రమ తగ్గుతుంది..
సామాజిక ఆరోగ్య కేంద్రాలు (CHC), సబ్-డివిజనల్ ఆసుపత్రుల్లో సులభంగా చికిత్స అందించగలిగే సాధారణ వ్యాధులు, శస్త్రచికిత్సలను గుర్తించి, అదనంగా 89 కొత్త ప్యాకేజీలను జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (NHA) ఎంపిక చేసింది. ప్రజలకు అత్యవసర వైద్య సేవలను వారి నివాసాలకు సమీపంలోనే అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశం. దీనివల్ల చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు కూడా రోగులు దూర ప్రాంతాల్లోని పెద్దాసుపత్రులకు వెళ్లాల్సిన ఇబ్బంది తప్పుతుందని ఎన్.హెచ్.ఏ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
అంతేకాకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మౌలిక సదుపాయాల వినియోగం పెరిగి, ‘ఆయుష్మాన్ భారత్- ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)’ రీయింబర్స్‌మెంట్ ద్వారా ఆసుపత్రులకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు.
కొత్తగా చేర్చనున్న ప్రధాన వ్యాధుల చికిత్సలు..
తీవ్రమైన రక్తహీనత (Severe anemia), అధిక రక్తపోటుతీవ్రమైన బ్రాంకైటిస్ (respiratory issues), జ్వరాలుఅతిసారం, జిగట విరేచనాలు, గ్యాస్ట్రోఎంటరైటిస్మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI), కిడ్నీ సంబంధిత నొప్పి (renal colic) మధుమేహంతో (diabetes) ముడిపడి ఉన్న పలు అనారోగ్య సమస్యలు.
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
