అంటార్కిటికాలో మొదటిసారిగా బర్డ్ ఫ్లూ కేసు నమోదు..
సాక్షి లైఫ్ : ఇటీవల అంటార్కిటికాలో బర్డ్ ఫ్లూ మొదటి కేసు నమోదైనట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అంటార్కిటిక్ ప్రధాన భూభాగంలో అత్యంత ప్రమాదకరమైన బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడం ఇదే తొలిసారి. బర్డ్ ఫ్లూని ఏవియన్ ఫ్లూ అని కూడా పిలుస్తారు, ఇది ఒక రకమైన ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ). ఇది ఎక్కువగా అడవి నీటి పక్షులకు సోకుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
స్కువా సముద్ర పక్షి..
ఇటీవల అర్జెంటీనా శాస్త్రవేత్తలు అంటార్కిటిక్ బేస్ ప్రైమావెరా సమీపంలో చనిపోయిన స్కువా సముద్ర పక్షి నమూనాలలో వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ కేసు H5N1 ఏవియన్ ఫ్లూ నుంచి జెంటూ పెంగ్విన్‌లకు చుట్టుపక్కల ద్వీపాలకు మరింత ప్రమాదంగా మారనుంది. కొన్ని నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలురకాల పక్షులను నాశనం చేసింది ఈ వైరస్. దీనికి సంబంధించి "పక్షులు ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా H5 సబ్-వేరియంట్‌తో సంక్రమించాయని, చనిపోయిన పక్షులలో అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ ఉందని CSIC ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇది కూడా చదవండి.. ఆరోగ్య పరిస్థితులపై మనసు ప్రభావం ఎంతగా చూపిస్తుందంటే..?
అంటార్కిటిక్ ప్రధాన భూభాగంలో ప్రాణాంతకమైన బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడం ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు తెలిపారు, ఇది దక్షిణ ప్రాంతంలోని పెద్ద పెంగ్విన్‌లకు సోకే ముప్పు ఉందని వారు వెల్లడించారు.
ఇది కూడా చదవండి.. క్యాన్సర్ కు సరికొత్త ఔషధం.. పరిశోధనలో గొప్ప విజయం..రూ.100కే టాబ్లెట్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
