అమెరికాలో బుబోనిక్ ప్లేగు వ్యాధి..
సాక్షి లైఫ్ : అమెరికాలో అలాస్కాపాక్స్ తర్వాత మరో వ్యాధి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బుబోనిక్ ప్లేగు వ్యాధి మొదటి కేసు వెలుగులోకి వచ్చింది. ఇది తీవ్రమైన అంటువ్యాధి, దీనిని (బ్లాక్ డెత్) అని కూడా అంటారు. ఎలుకలకు సోకిన పేల ద్వారా మానవులకు వ్యాపించే తీవ్రమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ వ్యాధి యునైటెడ్ స్టేట్స్‌లోని ఒరెగాన్ రాష్ట్రంలో 2015 తర్వాత తొలిసారిగా ఓ వ్యక్తికి బుబోనిక్ ప్లేగు వ్యాధి వచ్చింది.
బుబోనిక్ ప్లేగు వ్యాధి అంటే..?
బుబోనిక్ ప్లేగు వ్యాధి అనేది ఎలుకలను తినే పిల్లుల ద్వారా ఎక్కువగా మానవులకు వ్యాపించే తీవ్రమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్. అంతేకాదు ఈ వ్యాధి సోకిన జంతువులను తాకినా మనుషులకు ఈ బుబోనిక్ ప్లేగు వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. దీని కారణంగా మధ్య యుగాలలో మిలియన్ల మంది యూరోపియన్లు చనిపోయారు. యెర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల బుబోనిక్ ప్లేగు వ్యాధి వస్తుంది. ఇది సోకిన ఈగలు లేదా పేల ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఎలుకలు లేదా ఉడుతలు వంటి వాటిని కుట్టినా వ్యాధి ఎక్కువమందికి వచ్చే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి.. ముద్దు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
