సాక్షి లైఫ్ : అమెరికాలో క్యాన్సర్ మహమ్మారి తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా 50 ఏళ్లలోపు ఉన్న యువతలో(colorectal cancer)పెద్దపేగు క్యాన్సర్ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. తాజాగా అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (ACS) విడుదల చేసిన నివేదిక ప్రకారం..యువతలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న క్యాన్సర్లలో ఇది ముందంజలో ఉంది.
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
పెరుగుతున్న మరణాల రేటు..
గతంలో ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ల వల్ల మరణాలు ఎక్కువగా ఉండేవి. కానీ, 1990వ దశకం నుంచి కొలొరెక్టల్ క్యాన్సర్ మరణాల రేటు యువతలో నిరంతరాయంగా పెరుగుతూ వస్తోంది. మరణాల పెరుగుదల.. 2005 నుంచి ప్రతి ఏటా ఈ వయస్సు వారిలో మరణాల రేటు 1.1శాతం మేర పెరుగుతోంది. 1990వ దశకంలో మరణాల రేటులో 5వ స్థానంలో ఉన్న ఈ క్యాన్సర్, ఇప్పుడు మొదటి స్థానానికి చేరింది.
ఆశ్చర్యకరంగా, 65 ఏళ్లు పైబడిన వారిలో స్క్రీనింగ్ పరీక్షల వల్ల ఈ క్యాన్సర్ కేసులు తగ్గుతుండగా, యువతలో మాత్రం విస్తరిస్తోంది.
యువతలో క్యాన్సర్ పెరగడానికి కారణాలు ఏంటి..?
యువతలో ఈ క్యాన్సర్ పెరగడానికి ప్రధానంగా మారుతున్న ఆహారపు అలవాట్లే కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రాసెస్ చేసిన మాంసం (Processed Meat), రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం. వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చుని ఉండటం (Sedentary Lifestyle). అతిగా బరువు పెరగడం కూడా ఈ క్యాన్సర్ ముప్పును పెంచుతోంది. యువతలో దీనిపై అవగాహన లేకపోవడంతో, 4వ స్టేజ్ (Advanced Stage)కి చేరిన తర్వాతే బయటపడుతోంది.
ప్రస్తుతం అమెరికాలో స్క్రీనింగ్ వయస్సును 50 నుంచి 45 ఏళ్లకు తగ్గించారు. ముప్పై, నలభై ఏళ్ల వయస్సు వారు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మలంలో రక్తం పడటం, పేగు కదలికల్లో అకస్మాత్తుగా మార్పులు రావడం, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com