సాక్షి లైఫ్ : దేశంలో నిఫా వైరస్ (Nipah virus) మరోసారి విజృంభిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో ఐదు నిఫా వైరస్ కేసులు నమోదైనట్లు వైద్యశాఖాఅధికారిక వర్గాలు ధృవీకరించాయి. బాధితుల్లో ఒక వైద్యుడితో పాటు ముగ్గురు ఆరోగ్య సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరంతా కోల్‌కతాలోని బెలేఘాటా ఐడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి..Doomscrolling : మీరు 'డూమ్‌స్క్రోలింగ్' వలయంలో చిక్కుకున్నారా..? స్మార్ట్ ఫోన్‌కు బానిసలేనట్లే..!
ఇది కూడా చదవండి..Unnecessary Mental Stress : థైరాయిడ్ పరీక్షలు అనుమానం ఉంటేనే చేయించుకోవాలా..?
ఇది కూడా చదవండి..Food Packaging Labels : ఫుడ్ ప్యాకింగ్ వెనుక ఉన్న లేబుల్ పై ఈ అంశాలను గమనిస్తున్నారా..?
యుద్ధప్రాతిపదికన చర్యలు..
దీంతో అప్రమత్తమైన యంత్రాంగం..వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. క్వారంటైన్ బాధితులతో కాంటాక్ట్ అయిన దాదాపు 100 మందిని గుర్తించి, వారిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచారు. ఐదుగురు బాధితుల్లో ఇద్దరు నర్సుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిని ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. అయితే పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణుల బృందాన్ని కోల్‌కతా పరిసర ప్రాంతాలకు పంపింది.
జాగ్రత్తలు అవసరం..
నిఫా వైరస్‌కు నిర్దిష్టమైన టీకా గానీ చికిత్స గానీ లేదని, కేవలం జాగ్రత్తల ద్వారానే దీన్ని నివారించవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేలపై పడిన పండ్లు లేదా గబ్బిలాలు కొరికిన పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందు జాగ్రత్తగా పండ్లను, కూరగాయలను ఉప్పు నీటితో శుభ్రంగా కడిగిన తర్వాతే వాడాలి. జంతువులతో తాకిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా మెదడు వాపు (Encephalitis) లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
నిఫా వైరస్ గాలి ద్వారా సోకదు. కానీ వ్యాధి సోకిన జంతువుల ముఖ్యంగా గబ్బిలాలు, పందులు ద్రవాలు లేదా నిఫా వైరస్ బాధితుల ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com