సాక్షి లైఫ్ : మనుషుల్లో మాత్రమే కనిపించే 'లైఫ్ స్టైల్' వ్యాధులు ఇప్పుడు మూగజీవాలనూ వదలడం లేదు. మనకు వచ్చే చక్కెర వ్యాధి (Diabetes) ఇప్పుడు మన ఇంట్లో పెంచుకునే శునకాల్లోనూ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో పెంపుడు జంతువుల్లో ఈ సమస్య పెరుగుతోందని, దీనివల్ల అవి తమ కంటి చూపు కోల్పోతున్నాయని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..?
శునకాల్లో మధుమేహం కారణంగా అంధత్వం..!
పెంపుడు జంతువులు మనతో కలిసి ఉండటం వల్ల మనం తినే ఆహారాన్నే వాటికీ పెట్టడం ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు.
మధుమేహం ఉన్న శునకాల్లో రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల కంటిలోని ద్రవాల్లోకి 'సార్బిటాల్' అనే పదార్థం చేరుతుంది. ఇది కంటి లెన్స్‌లోకి నీటిని లాగి, కంటి శుక్లాలు (Cataracts) రావడానికి దారితీస్తుంది.
సాధారణంగా మధుమేహం ఉన్న శునకాల్లో షుగర్ బయటపడిన ఏడాది లోపే 75శాతం నుంచి 80శాతం జంతువులకు శుక్లాలు ఏర్పడి అంధత్వం వస్తోంది. కొన్నిపెంపుడు జంతువుల్లో కొద్ది రోజుల్లోనే లేదా రాత్రికి రాత్రే కంటి చూపు మందగిస్తోందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
టిక్ ఫీవర్ (Tick Fever)..
గోమారి పురుగుల ద్వారా సోకే 'ఎర్లిచియా కానిస్' (Ehrlichia canis) ఇన్ఫెక్షన్ కూడా ఇప్పుడు భిన్నంగా కనిపిస్తోంది. గతంలో ఇది కేవలం జ్వరం, ప్లేట్‌లెట్ల తగ్గింపుకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు దీనివల్ల కంటిపై తీవ్ర ప్రభావం పడుతోంది.
కళ్లు ఎర్రబడటం (Uveitis), కంటి లోపల వాపు, నీరు చేరడం (Corneal oedema), రెటినా విడిపోవడం (Retinal detachment) వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తున్నాయి.
రాజేంద్రనగర్‌లో పశువైద్యులకు శిక్షణ..
పెంపుడు జంతువుల్లో పెరుగుతున్న ఈ కంటి వ్యాధులను గుర్తించి, చికిత్స అందించేందుకు రాజేంద్రనగర్‌లోని కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయిలో ఉన్న పశువైద్యులకు కంటి పరీక్షలు, సర్జరీల్లో శిక్షణ ఇచ్చి, శాశ్వత అంధత్వాన్ని నివారించడం కోసం రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ కృషి చేస్తోంది.
యజమానులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే..?
ఆహారం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రాసెస్డ్ ఫుడ్, స్వీట్లు జంతువులకు పెట్టకూడదు.పెంపుడు కుక్కలకు రోజూ నడక తప్పనిసరి. ఒకవేళ పెంపుడు కుక్కలు అతిగా నీరు తాగడం, బరువు తగ్గడం, కళ్లు తెల్లగా మారడం వంటివి గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com