వైద్య కళాశాలల బలోపేతానికి పటిష్ట కార్యాచరణ ప్రణాళిక: అధికారులకు కీలక ఆదేశాలు..!
సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రంలోని వైద్య విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు అత్యాధునిక వసతులతో, పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి తక్షణమే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని స్పష్టం చేశారు. ఐసీసీసీలో సోమవారం వైద్యారోగ్య శాఖపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
కళాశాలల క్షేత్ర స్థాయి పరిశీలనకు ప్రత్యేక కమిటీ..
వైద్య కళాశాలల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులను అంచనా వేయడానికి అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కమిటీ ప్రతి కళాశాలను క్షేత్ర స్థాయిలో సందర్శించి, అక్కడ అవసరమైన మౌలిక వసతులు, నిధుల అవసరం, తక్షణమే పూర్తి చేయాల్సిన పనులు, ప్రభుత్వ పరంగా అందించాల్సిన సహాయం వంటి సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
మూడేళ్లలో అన్ని కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో సిద్ధం కావాలి..
జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు, బోధన సిబ్బందికి ప్రమోషన్లు, అనుబంధ ఆసుపత్రుల్లో పడకల పెంపు, అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు, ఖాళీల భర్తీ వంటి అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులను తక్షణమే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమతులకు సంబంధించిన ఏవైనా అంశాలుంటే, వెంటనే తెలియజేస్తే కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆ శాఖ అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని సీఎం పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
