ఢిల్లీ-ఎన్‌సీఆర్: హెచ్3ఎన్2 ఫ్లూ కలకలం..
సాక్షి లైఫ్ : ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో హెచ్3ఎన్2 (H3N2) ఇన్ఫ్లూయెంజా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి అక్కడి ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. సాధారణ జ్వరం, దగ్గుతో మొదలవుతున్న లక్షణాలు తీవ్రమై ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వైరస్‌ను ఎదుర్కోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఢిల్లీ లోని పలు ఆసుపత్రుల్లో ఓపిడి కేసులు పెరుగుతున్నాయి. లక్షణాలు ఎక్కువగా జ్వరం ఎక్కువ, దగ్గు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, వీక్ నెస్ వంటివి బాధితులలో కనిపిస్తున్నాయి. కొంతమంది విషయంలో తీవ్రమైన లక్షణాలు కనిపించడంతో హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. అయితే తీవ్రమైన లక్షణాలు కనిపించిన వారు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతోంది. సాధారణ ఫ్లూ‑వంటి లక్షణాలున్నవారికి 3 నుంచి 5 రోజులు, మరికొందరు కోలుకోవడానికి ఒక వారం లేదా అంతకంతకు మించి సమయం పడుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులకు ఈ వైరస్ ఎక్కువ ప్రమాదం అని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
