Diabetes Sensational Facts : ఆ లోపమే మధుమేహానికి అసలు విలన్..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మధుమేహం (Diabetes) గురించి ఇప్పటి వరకు మనం నమ్ముతున్న ఒక పెద్ద అపోహకు గ్యాస్ట్రో వైద్య నిపుణుడు డాక్టర్ పాల్ తెరదించారు. డయాబెటిస్‌కు కారణం కేవలం చక్కెర (Sugar) ఒక్కటే కాదు, అసలు సమస్య దేని వల్ల వస్తుందో ఆయన స్పష్టంగా వివరించారు. ఈ నిజాలు చాలా మందికి కనువిప్పు కలిగించే విధంగా ఉన్నాయి.

 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

 చక్కెర విలన్ కాదు..

మధుమేహ సమస్యకు ప్రధాన కారణాల్లో అందరూ ముందుగా వేలెత్తి చూపించేది పంచదారనే. "చక్కెర అనేది మధుమేహానికి అసలు కారణం కాదు, అది కేవలం ఒక లక్షణం మాత్రమే. అసలు విలన్ 'ఇన్సులిన్ నిరోధకత' (Insulin Resistance)!" అని గ్యాస్ట్రో వైద్య నిపుణుడు డాక్టర్ పాల్ చెబుతున్నారు.

ఇన్సులిన్ నిరోధకత అంటే ఏమిటి..?

మనం ఆహారం తిన్నప్పుడు, ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, షుగర్ తీసుకున్నప్పుడు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఈ గ్లూకోజ్‌ను కణాలలోకి పంపడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. సమస్య ఎక్కడంటే.. ఇన్సులిన్ నిరోధకత ఉన్నప్పుడు, మన శరీర కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించవు (Stop Responding).ఇన్సులిన్ సరిగా పని చేయకపోవడంతో, రక్తంలోని చక్కెర రక్తంలోనే ఉండిపోతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి (Hyperglycemia), కొవ్వు పేరుకుపోతుంది. ముఖ్యంగా పొట్ట చుట్టూ, శరీరంలో వాపు (Inflammation) పెరుగుతుంది.

అంటే, మీరు చక్కెర తినకపోయినా, ఇన్సులిన్ నిరోధకత ఉంటే మధుమేహం వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని డాక్టర్ పాల్ హెచ్చరిస్తున్నారు.

 ఇన్సులిన్ నిరోధకతను ప్రేరేపించే అసలు కారకాలు ఇవే..!

ఇన్సులిన్ నిరోధకత ఎందుకు వస్తుందో కూడా డాక్టర్ పాల్ చాలా స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా మన ఆధునిక జీవనశైలిలోని ఈ ఐదు అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. 

నిద్ర లేమి (Poor Sleep).. నిద్ర సరిగా లేకపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది.

శారీరక శ్రమ లేకపోవడం (Inactivity)..నిశ్చల జీవనశైలి కారణంగా కండరాలు రక్తంలోని గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేవు.

దీర్ఘకాలిక ఒత్తిడి (Chronic Stress)..నిరంతర ఒత్తిడి వల్ల కార్టిసాల్ (Cortisol) హార్మోన్ విడుదలై, అది ఇన్సులిన్ పనితీరును అడ్డుకుంటుంది.

ప్రాసెస్ చేసిన ఆహారం (Processed Foods)..శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలు, అనారోగ్యకరమైన కొవ్వులు ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తాయి.

ఊబకాయం (Obesity)..ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు (Visceral Fat) ఇన్సులిన్ పనితీరును తీవ్రంగా అడ్డుకుంటుంది.

 ప్రారంభ హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయంటే..?
 
బ్లడ్ షుగర్ స్థాయిలు ప్రమాదకరంగా పెరగడానికి ముందే, ఇన్సులిన్ నిరోధకత ఉన్నట్లు మన శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుందని డాక్టర్ పాల్ తెలిపారు. అలసట (Fatigue).. ముఖ్యంగా భోజనం తర్వాత ఎక్కువగా అలసిపోవడం. తీపి పదార్థాల కోరిక (Sweet Cravings).. పదే పదే స్వీట్స్ తినాలనిపించడం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించి, జీవనశైలి మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహ ప్రమాదాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చని ఆయన సూచించారు.

 

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.