వయ వందన యోజన పథకం ద్వారా వృద్ధులకు ఏప్రిల్ 28 నుంచి హెల్త్ కార్డ్ ల పంపిణీ..  

సాక్షి లైఫ్ : ఢిల్లీ ప్రభుత్వం వయ వందన యోజన కింద 70 ఏళ్లు నిండిన అంతకంటే పైబడిన వయస్సు కలిగిన సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్యసేవలు కల్పించాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని ఏప్రిల్ 28న త్యాగరాజ స్టేడియంలో ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. ఈ పథకం కింద, నమోదుచేసుకున్న సీనియర్ సిటిజన్‌కు ఒక హెల్త్ కార్డ్ లభిస్తుంది, దీనిలో ఆరోగ్య రికార్డులు, అత్యవసర సేవల గురించిన సమాచారాన్ని పొందుపరుస్తారు.

 

ఇది కూడా చదవండి..సమ్మర్ అలర్ట్ : వేసవిలో ఏ రకమైన ఆహారాలకు దూరంగా ఉండాలి..?

ఇది కూడా చదవండి..ఫుడ్ అనేది పిల్లలపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది..? 


ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..

 
ఏప్రిల్ 28తేదీన ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కొంతమంది వృద్ధులకు హెల్త్ కార్డులు అందించనున్నారు. "వయ వందన యోజన" సమర్థవంతంగా, సమగ్రంగా అమలు చేయడం ,ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిర్మాణం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

“వయ వందన యోజన” కింద ప్రతి సీనియర్ సిటిజన్‌కు హెల్త్ కార్డ్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా, వారి హెల్త్  రికార్డ్స్, సాధారణ ఆరోగ్య తనిఖీల గురించిన సమాచారంతోపాటు అత్యవసర సేవలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందుబాటులో ఉంటుంది.

1.69 లక్షల ఆయుష్మాన్ కార్డులు.. 

ప్రతి జిల్లా కార్యాలయం, ప్రజా ప్రతినిధులు గుర్తించిన ప్రదేశాలలో రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. 1.69 లక్షల ఆయుష్మాన్ కార్డులు తయారు చేశామని అధికారులు చెబుతున్నారు.  

ఇది కూడా చదవండి..వంట నూనెలలో ఉండే కొవ్వు కారణంగా రొమ్ము క్యాన్సర్‌..

ఇది కూడా చదవండి..వరల్డ్ లివర్ హెల్త్ డే-2025: కాలేయ పనితీరు తెలుసుకునే ముఖ్యమైన వైద్య పరీక్షలు..

ఇది కూడా చదవండి..మీకు అధిక కొలెస్ట్రాల్ ఉందా..? ఈ 5 కూరగాయలు తినండి.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : delhi central-health-ministry old-man ayushman-card-for-senior-citizens ayushman-bharat-health-insurance-for-senior-citizens-above-70 ayushman-bharat-scheme-extended-for-senior-citizens-above-70 how-to-make-ayushman-card-for-senior-citizens senior-citizens-health-insurance senior-citizens-health-insurance-india senior-citizen senior-citizens-health-insurance-in-india insurance-for-senior-citizens india-senior-citizen-health-insurance ayushman-bharat-for-senior-citizens ayushman-bharat health-ministry vayavandana-yojana elderly-welfare senior-citizen-support government-scheme healthcare-for-elderly senior-citizens senior-citizens-health-cards senior-citizens-health
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com