సాక్షి లైఫ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఊబకాయాన్ని ఇకపై కేవలం జీవనశైలి సమస్యగా కాకుండా, "దీర్ఘకాలిక, పునరావృతమయ్యే వ్యాధి"గా ప్రకటించింది. దీనికి జీవితకాల చికిత్స అవసరమని నొక్కి చెప్పింది. సెమాగ్లూటైడ్ వంటి GLP-1 (గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1) ఔషధాలను ఊబకాయం ఉన్న పెద్దలకు ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం దీర్ఘకాలిక చికిత్సగా WHO సిఫార్సు చేసింది.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
బహుళ ఆరోగ్య ప్రయోజనాలు..
ఈ మందులు కేవలం బరువు తగ్గించడమే కాకుండా, గుండె జబ్బులు, మధుమేహం నివారణ, కొవ్వు కాలేయం, రక్తపోటు అదుపు వంటి అనేక మెటబాలిక్, కార్డియోవాస్కులర్ ప్రయోజనాలను అందిస్తాయని మార్గదర్శకాలు పేర్కొన్నాయి.
సమగ్ర చికిత్స అవసరం..
ఔషధాలతో పాటు, ఇంటెన్సివ్ బిహేవియరల్ థెరపీ (IBT) (ఆహారం, వ్యాయామం, కౌన్సెలింగ్) తప్పనిసరిగా తీసుకోవాలని WHO సూచించింది.
భారత్‌లో నలుగురిలో ఒకరు స్థూలకాయులుగా ఉండటం, 2050 నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో చికిత్స అత్యవసరమని వెల్లడించింది.
ప్రధాన అడ్డంకులు (Challenges)..
WHO ఈ సిఫార్సులను 'షరతులతో కూడినవి'గా పేర్కొంది. దీనికి కారణం ఔషధాల అధిక ధర, ఉత్పత్తి సామర్థ్యం పరిమితంగా ఉండటం, అంటే అవసరమైన దానికంటే కేవలం 10శాతం మందికే లభ్యం కావడం. ధరలను తగ్గించడానికి వాలంటరీ లైసెన్సింగ్ వంటి విధానపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే నివారణపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని WHO విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com