సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ (HIV) మహమ్మారిని అంతం చేయడానికి నిరంతర పోరాటం జరుగుతున్నప్పటికీ, పొరుగు దేశమైన నేపాల్‌లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. నివారణ, చికిత్స చర్యలు అమలులో ఉన్నప్పటికీ, ఈ ప్రాణాంతక వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన లోపించడం, మందులు అందకపోవడం వంటి కారణాల వల్ల ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇది కూడా చదవండి..Hyderabad Pollution Threat : హైదరాబాద్ కు కాలుష్యం ముప్పు.. బెంబేలెత్తుతున్న ప్రజలు..!
ఇది కూడా చదవండి..World Aids day-2025 : ఆందోళన కలిగిస్తున్న పాకిస్తాన్ హెచ్‌ఐవీ వ్యాప్తి..
ఇది కూడా చదవండి..Latest Study : హెచ్ పీవీ టీకాతో గర్భాశయ క్యాన్సర్‌కు 90% చెక్..! కొత్త పరిశోధనలో వెల్లడి..!
నేషనల్ ఎయిడ్స్ అండ్ ఎస్టీడీ కంట్రోల్ సెంటర్ (National AIDS and STD Control Centre - NCASC) విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ భయంకర వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి. గతేడాది 2024 సంవత్సరంలో నేపాల్‌లో హెచ్‌ఐవీ సంబంధిత వ్యాధుల కారణంగా మరణించిన వారి సంఖ్య, కొత్తగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.559 మంది హెచ్‌ఐవీ కారణంగా మరణించినట్లు అంచనా.. 614 మంది కొత్తగా హెచ్‌ఐవీ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 2024 ముగిసే నాటికి, నేపాల్‌లో సుమారు 34,337 మంది వ్యక్తులు హెచ్‌ఐవీతో ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
చికిత్స అందక 23 శాతం మంది దూరం..!
హెచ్‌ఐవీ బాధితులకు ఉచితంగా యాంటీరెట్రోవైరల్ (ARV) చికిత్సను అందించడానికి నేపాల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 96 ART కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ, చికిత్స పొందేవారి సంఖ్య ఇంకా తక్కువగా ఉంది. ప్రస్తుతం హెచ్‌ఐవీతో జీవిస్తున్నవారిలో కేవలం 77 శాతం మంది మాత్రమే ART చికిత్స పొందుతున్నారు. సుమారు 23 శాతం మంది బాధితులు అంటే సుమారు 8వేల మంది చికిత్సకు దూరంగా ఉన్నారు. చికిత్స అందుబాటులో లేకపోవడం లేదా అవగాహన లోపం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది.
అధిక ప్రమాదంలో..
నేపాల్‌లో హెచ్‌ఐవీ వ్యాప్తి అధికంగా ఉన్న వర్గాలను గుర్తించారు. ఈ వర్గాలకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని NCASC సూచిస్తోంది.ముఖ్యంగా పొరుగు దేశాల నుంచి తిరిగి వచ్చే వలస కార్మికులు, వారి కుటుంబాలు. అధ్యయనాల ప్రకారం, హెచ్‌ఐవీ సోకిన ప్రతి ఐదుగురిలో ఒకరికి అంటే సుమారు 20శాతం తమ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియడం లేదు. ఇది వ్యాధి మరింత వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణమవుతోంది.మత్తు ఇంజెక్షన్లు తీసుకునేవారు, లైంగిక కార్యకర్తలు, పురుషులతో లైంగిక సంబంధాలు పెట్టుకునే పురుషులు (MSM), ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కూడా అధిక ప్రమాదంలో ఉన్నారు.
2030 లక్ష్యాన్ని చేరుకోవాలంటే...
ఎయిడ్స్ మహమ్మారిని 2030 నాటికి అంతం చేయాలనే ప్రపంచ లక్ష్యంలో భాగంగా, నేపాల్ కూడా 95-95-95 లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. హెచ్‌ఐవీతో జీవిస్తున్నవారిలో 95 శాతం మందికి తమ ఆరోగ్య స్థితి తెలిసి ఉండాలి. 95 శాతం మందిలో 95 శాతం మందికి చికిత్స అందుబాటులో ఉండాలి. చికిత్స పొందుతున్న 95 శాతం మందిలో వైరల్ లోడ్ నియంత్రణలో ఉండాలి. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే, హెచ్‌ఐవీ పరీక్షలను విస్తృతం చేయడం, వివక్షను రూపుమాపడం, మందుల సరఫరాకు నిధులు పెంచడం వంటి అంశాలపై నేపాల్ ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com