సాక్షి లైఫ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'స్క్రబ్ టైఫస్' జ్వరాల కేసులు తీవ్రంగా పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. నల్లిని పోలిన చిన్న కీటకం కాటు ద్వారా వచ్చే ఈ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ఇప్పటికే రాష్ట్రంలోని 26 జిల్లాలకూ విస్తరించింది. ముఖ్యంగా చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. సమయానికి గుర్తించి చికిత్స తీసుకోకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.