డా. ప్రవీణ్ సర్జరీకి ఇంటెర్నేషనల్ రికగ్నిషన్ : 'పెయిన్‌లెస్ హైబ్రిడ్ లేజర్ శాండ్‌విచ్ ప్రొసీజర్'కు అరుదైన గౌరవం..
సాక్షి లైఫ్ : వైద్య రంగంలో నిరంతరం విశేష కృషి చేస్తూ, అత్యాధునిక చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడంలో ముందుండే డాక్టర్ పల్లం ప్రవీణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ఆయన స్వయంగా అభివృద్ధి చేసిన 'పెయిన్‌లెస్ హైబ్రిడ్ లేజర్ శాండ్‌విచ్ ప్రొసీజర్' హేమోరాయిడ్స్ (పైల్స్) చికిత్సలో అద్భుతమైన ఫలితాలను అందించి, అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ప్రస్తుతం డా. పల్లం ప్రవీణ్ ఉస్మానియా హాస్పిటల్ లో జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ కు హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ (హెచ్ ఓడీ)గా సేవలందిస్తున్నారు.
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?
ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?
గత నాలుగేళ్లుగా 500 మందికి పైగా రోగులపై డాక్టర్ ప్రవీణ్ ఈ వినూత్న విధానాన్ని విజయవంతంగా అమలు చేశారు. రోగులకు నొప్పి లేకుండా, పైల్స్ తిరిగి రాకుండా ఉండేందుకు ప్రవీణ్ అందించిన వైద్యవిధానం చాలాబాగా పనిచేసింది. ఈ విజయవంతమైన ప్రయోగానికి సంబంధించిన పరిశోధనాత్మక వ్యాసాన్ని డాక్టర్ ప్రవీణ్ ప్రపంచ ప్రఖ్యాత 'ఇంటర్నేషనల్ సర్జరీ జర్నల్' కు సమర్పించారు. పలువురు ప్రముఖ సర్జన్ల నిశిత సమీక్షల అనంతరం, ఈ వ్యాసం ప్రచురణకు అంగీకరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ, "రోగులకు కేవలం తాత్కాలిక ఉపశమనం కాకుండా, శాశ్వత పరిష్కారం అందించాలన్నదే నా లక్ష్యం. నేను కనుగొన్న ఈ పద్ధతికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం నాకెంతో ఎంతో సంతోషంగా ఉంది" అని అన్నారు.
డాక్టర్ ప్రవీణ్ ఆవిష్కరించిన ఈ విధానం, హేమోరాయిడ్స్ చికిత్సలో నొప్పిని తగ్గించడమే కాకుండా, దీర్ఘకాలిక ఉపశమనాన్ని అందిస్తుందని నిరూపితమైంది. ఇది భారతీయ వైద్య రంగానికి, ముఖ్యంగా సర్జికల్ స్పెషాలిటీకి గర్వకారణం" అని ఆయన వెల్లడించారు.
గత 100 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు సాధారణ శస్త్రచికిత్సలో ఒకరిద్దరు తప్ప భారతదేశంలో ఏ ఒక్క వైద్యుడు సాధించలేని సరికొత్త లేజర్ విధానాన్ని పైల్స్ చికిత్సకు కనిపెట్టిన మొదటి వైద్యుడిగా డాక్టర్ పల్లం ప్రవీణ్ నిలిచారు.
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
