Ebola Virus Scare in Hyderabad : హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ కలకలం..! సుడాన్ యువకుడికి అనుమానిత లక్షణాలు.. గాంధీ ఆసుపత్రికి తరలింపు..
సాక్షి లైఫ్ : ఇప్పటివరకూ పలు దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ హైదరాబాద్ కు చేరింది. హైదరాబాద్ నగరంలో ఎబోలా వైరస్ కలకలం రేపింది. సుడాన్ దేశానికి చెందిన ఓ యువకుడు ఎబోలా అనుమానిత లక్షణాలతో బాధపడుతుండటంతో నగర వైద్యారోగ్య శాఖ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఈ వైరస్ సోకిన యువకుడిని మహ్మద్ గా గురించారు డాక్టర్లు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాధితుడిని తక్షణమే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి, వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. శ్యాంపిల్స్ సేకరించి హబ్సీగూడలోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB)కి పంపినట్లు వైద్యులు వెల్లడించారు. ఎబోలా వార్డ్ నోడల్ అధికారిగా డా.సునీల్‌కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఆందోళన వద్దు..
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి ఎబోలా పాజిటివ్ కేసు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో నిఘాను మరింత తీవ్రం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా 10 పడకల ఐసోలేషన్ వార్డును సిద్ధం చేసి, నోడల్ అధికారులను నియమించారు.
వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. విదేశాల నుంచి, ముఖ్యంగా ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే వారు జ్వరం, తీవ్ర అలసట, ఒంటినొప్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ఆరోగ్య శాఖ సూచించింది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష..
ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
