హైదరాబాద్ నిమ్స్‌లో ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు
సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, సెప్టెంబర్ 22తేదీ నుంచి 28తేదీ వరకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు అందించేందుకు యూకే వైద్యుల బృందం వస్తుంది. నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప, ఈ ప్రత్యేక శిబిరం గురించి మాట్లాడుతూ, “యూకేలో స్థిరపడిన డాక్టర్ రమణ దన్నపనేని ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఒక వారం పాటు నిమ్స్ ఆసుపత్రిలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది కూడా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు" ఆయన వెల్లడించారు.
ఇది కూడా చదవండి..కృత్రిమ చక్కెర వాడితే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి..ఎంపాక్స్ ని నివారించే మార్గాలు..
ఇది కూడా చదవండి..ఇలాంటి జాగ్రత్తలు లేకపోతేనే మధుమేహ సమస్య వస్తుంది..?
యూకే వైద్యుల బృందం..
డాక్టర్ రమణ దన్నపనేని నేతృత్వంలో, యూకే వైద్యుల బృందం ఈ శిబిరంలో పాల్గొంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న చిన్నారులకు ఉచితంగా గుండె సంబంధిత శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు.గుండెలో రంధ్రం, ఇతర గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు ఈ ఉచిత వైద్య సేవలను పొందవచ్చు. నిమ్స్ కార్డియోథొరాసిక్ విభాగాధిపతి ప్రొఫెసర్ అమరేశ్వరరావు, సీనియర్ వైద్యులు గోపాల్, ఇతర సిబ్బంది ఈ శస్త్రచికిత్సలను నిర్వహించనున్నారు.
నమోదు ఎలా అంటే..?
చికిత్సకు రిజిస్ట్రేషన్: ఈ ఉచిత వైద్య సేవలను పొందాలనుకునే వారు పంజాగుట్ట నిమ్స్‌లోని కార్డియో థొరాసిక్ వైద్యులను సంప్రదించాలని సూచించారు. మరింత సమాచారం కోసం: నిమ్స్ అధికారిక వెబ్‌సైట్ లేదా ఆసుపత్రి కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
ఇది కూడా చదవండి..గోరువెచ్చని నీళ్లు తాగితే వెయిట్ లాస్ అవుతారా..? నిజమేనా..?
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
