సాక్షి లైఫ్ : బార్‌కోడ్‌లు తప్పనిసరి చేసిన 300 మందులను కఠినంగా తనిఖీ చేయాలని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించి డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోలర్ జనరల్ కోరారు.
ఇది కూడా చదవండి.. అవకాడో మెదడుకు అద్భుతమైన సూపర్ ఫుడ్..
నకిలీ మందులు..
బార్‌కోడ్‌లో ఔషధ తయారీ లైసెన్స్, బ్యాచ్ గురించిన సమాచారం ఉంటుంది. భారత ఫార్మాస్యూటికల్ మార్కెట్లో నకిలీ మందులు పెరుగుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే పలు ప్రముఖ కంపెనీల పేరుతో తక్కువ నాణ్యతతో కూడిన మందులు మార్కెట్లోకి వస్తున్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితిలో ఫార్మాస్యూటికల్ మార్కెట్లో పారదర్శకతను నిర్ధారించడానికి బార్‌కోడ్ అమలు చేయనున్నారు.
దీనివల్ల మందుల కొరత కూడా తొలగిపోవచ్చని అంచనా వేశారు. అయితే, ఈ ప్రాజెక్టు అమలు వల్ల భారీ ఆర్థిక భారం పడుతుందనే కారణంతో తయారీదారుల సంఘం వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టు మొదటి దశగా 300 మందులపై కోడ్ సేకరణను అమలు చేయాలని నిర్ణయించారు.
మొదటి దశ విజయాన్ని అంచనా వేసిన తర్వాత దశలవారీగా అన్ని మందులపై బార్‌కోడ్‌లను అమలు చేయాలని ఆరోగ్య శాఖా అధికారులు యోచిస్తున్నారు.
విఫలమైన కంపెనీలపై చర్యలు..
తనిఖీల్లో విఫలమైన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఔషధ శాఖలను కూడా కోరింది డ్రగ్ కంట్రోలర్ జనరల్. దీంతోపాటు నకిలీ మందుల నియంత్రణకు శాశ్వత కమిటీ ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇది కూడా చదవండి..ఇన్ఫెర్టిలిటీ సమస్యలకు కారణాలు..?
ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి.. అనస్తీషియా ఖాళీ కడుపుతోనే ఎందుకు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com