Protein Coffee : ప్రోటీన్ కాఫీ : ట్రెండ్ అవుతోన్న 'ప్రోఫీ'.. సోషల్ మీడియాలో పెరుగుతున్న క్రేజ్.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఉరుకుల పరుగుల జీవితంలో ఫిట్‌నెస్‌పై యువత ఆసక్తి పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో సరికొత్త హెల్త్ ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ఒకప్పుడు ఆరెంజ్ జ్యూస్ కాఫీ సందడి చేయగా.. ఇప్పుడు సాధారణ కాఫీకి, ప్రోటీన్ షేక్ జతకలిసి 'ప్రోటీన్ కాఫీ' (Protein Coffee) గా ట్రెండ్ అవుతోంది. దీన్నే కుదించి 'ప్రోఫీ' (Proffee) అని పిలుస్తున్నారు. జిమ్‌లో కసరత్తులు చేసేవారితో పాటు, ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేసే ఉద్యోగులు ఈ పానీయం వైపు ఆకర్షితులవు తున్నారు. తక్షణ శక్తినిచ్చే ఈ ట్రెండింగ్ కాఫీలో ఎన్ని లాభాలున్నాయో.. అన్నే నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

అసలేంటీ 'ప్రోఫీ'..?

2020 నుంచి ఈ ప్రోటీన్ కాఫీ ట్రెండ్ నెట్టింట క్రమంగా ఊపందుకుంది. వే ప్రోటీన్ (Whey Protein) లేదా మార్కెట్లో దొరికే రెడీ-టు-డ్రింక్ ప్రోటీన్ షేక్‌ను.. పాలు, కాఫీ డికాక్షన్‌తో కలిపి దీన్ని తయారు చేస్తారు. బిజీ జీవనశైలి కారణంగా కాఫీ ద్వారా వచ్చే 'కెఫిన్' ఉత్తేజాన్ని, కండరాలకు కావలసిన 'ప్రోటీన్'ను ఒకేసారి పొందేందుకు చాలామంది దీన్ని వ్యాయామానికి ముందు తీసుకునే పానీయంగా (Pre-workout drink) ఎంచుకుంటున్నారు.

ఆరోగ్య ప్రయోజనాలు..? 

ఈ ప్రోటీన్ కాఫీని మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి కొన్ని ప్రయోజనాలు అందుతాయి. కాఫీలోని కెఫిన్ నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచి ఏకాగ్రతను, చురుకుదనాన్ని పెంచుతుంది. వ్యాయామం తర్వాత కండరాల అలసటను తగ్గించి, అవి త్వరగా కోలుకోవడానికి (Muscle recovery) ఇందులోని ప్రోటీన్ సహాయపడుతుంది. కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్, పాలీఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అల్జీమర్స్, పార్కిన్సన్స్, టైప్-2 డయాబెటీస్ వంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తాయి.  ప్రోటీన్ తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది.

దుష్ప్రభావాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

ప్రోఫీతో లాభాలు ఉన్నప్పటికీ, దాని తయారీలో వాడే పదార్థాల వల్ల కొన్ని దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. అధిక చక్కెర ముప్పు..మార్కెట్లో దొరికే చాలా రకాల ప్రోటీన్ పౌడర్లలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అలాగే కృత్రిమ రుచులు (Artificial Flavours) కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. జీర్ణకోశ సమస్యలు..కాఫీకి ప్రోటీన్ పౌడర్ కలపడం వల్ల పానీయం చిక్కగా మారుతుంది. ఈ మిశ్రమం కొందరిలో జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వేధిస్తాయి.

కిడ్నీలపై భారం..శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ మోతాదులో ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై (Kidneys) తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీర్ఘకాలంలో ఇది మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. కెఫిన్ సెన్సిటివిటీ.. కెఫిన్ సరిపడని వారు, నిద్రలేమి సమస్యలతో బాధపడేవారు ఈ ప్రోటీన్ కాఫీకి దూరంగా ఉండటమే మేలు. సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది కదా అని ఏది పడితే అది తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. మీ శరీర తత్వం, ఆరోగ్య పరిస్థితిని బట్టి మీ డైట్‌లో మార్పులు చేసుకునే ముందు వైద్యులను లేదా పోషకాహార నిపుణులను (Nutritionist) సంప్రదించాలి.

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..?

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.