Intermittent Fasting : బరువు తగ్గాలని 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' చేసేవాళ్లు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గడం కోసం చాలామంది రకరకాల పద్ధతులు పాటిస్తున్నారు. అందులో బాగా ప్రాచుర్యం పొందిన విధానం 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' (Intermittent Fasting). రోజులో నిర్దిష్ట సమయం మాత్రమే ఆహారం తీసుకుంటూ, మిగతా సమయం ఉపవాసం ఉండటం దీని ప్రధాన ఉద్దేశం. దీనివల్ల బరువు తగ్గడంతో పాటు, రక్తపోటు అదుపులో ఉండటం వంటి ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఇది అందరికీ సురక్షితం కాదని, బరువు తగ్గే క్రమంలో ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఆరోగ్య ప్రయోజనాలు అందరికీ ఒకేలా ఉండవు..

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల తీసుకునే క్యాలరీలు పరిమితం అవుతాయి కాబట్టి బరువు సులభంగా తగ్గుతారు. 16 గంటల పాటు ఉపవాసం ఉండే పురుషుల్లో కొవ్వు శాతం తగ్గినట్లు కొన్ని పరిశోధనల్లో తేలింది. అయితే, ఈ ఫలితాలు ప్రతి ఒక్కరికీ ఒకేలా ఉండవు. వయసు, బరువు, తీసుకునే ఆహారం, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఫలితాలు మారుతుంటాయి. ముఖ్యంగా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ల సలహా లేకుండా ఈ తరహా ఉపవాసాలు చేయడం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువ.

తలనొప్పి, నీరసం..

ఈ ఫాస్టింగ్ ప్రారంభించిన కొత్తలో చాలామందికి తలనొప్పి రావడం సహజం. కడుపు ఎక్కువసేపు ఖాళీగా ఉండటం వల్ల కొందరిలో తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2020లో జరిగిన ఓ అధ్యయనం కూడా ఫాస్టింగ్ చేసే వారిలో తలనొప్పి సమస్యలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఒకవేళ ఫాస్టింగ్ సమయంలో పదేపదే తలనొప్పి వేధిస్తుంటే, దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్త..!

డయాబెటిస్ ఉన్నవారికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏమాత్రం శ్రేయస్కరం కాదు. దీర్ఘకాలం పాటు కడుపు మాడ్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పడిపోయే అంటే హైపోగ్లైసీమియా (hypoglycemia) ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇన్సులిన్ లేదా షుగర్ మాత్రలు వాడేవారు, తమకు తాముగా సొంత నిర్ణయాలు తీసుకుని ఉపవాసాలు చేయకూడదు. డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వారు ఆహార నియమాలు పాటించాలి.

మందులు వాడేవారు ఇవి గుర్తుంచుకోండి..

రక్తపోటు (bp), గుండె సంబంధిత సమస్యలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్‌కు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే, కొన్ని రకాల మందులను తప్పనిసరిగా ఆహారంతో పాటే లేదా ఆహారం తీసుకున్న వెంటనే వేసుకోవాల్సి ఉంటుంది. ఉపవాసం వల్ల మందులు వేసుకునే సమయాలు మారిపోయి, చికిత్సపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, సురక్షితమైన మార్గంలో మాత్రమే ఆ ప్రయత్నం చేయాలి. ఏదైనా కొత్త డైట్ విధానాన్ని మొదలుపెట్టే ముందు కచ్చితంగా మీ వైద్యుడిని లేదా డైటీషియన్‌ను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.