సీజనల్ వ్యాధుల నివారణపై హెల్త్ మినిస్టర్ రివ్యూ మీటింగ్..
సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా హైదరాబాద్ లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సీజనల్ వ్యాధుల నివారణ పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రదర్శనను మంత్రి పరిశీలించారు.
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు పూర్తి నియంత్రణలో ఉన్నాయని మంత్రికి వివరించారు ఆరోగ్య శాఖ అధికారులు. గత సంవత్సరంతో పోలిస్తే సీజనల్ వ్యాధులు ఈ ఏడాది తగ్గుముఖం పట్టాయని డైరెక్టర్ అఫ్ హెల్త్ డా. రవీందర్ కుమార్ వెల్లడించారు. తెలంగాణరాష్ట్రంలో ప్రజారోగ్య శాఖ సీజనల్ వ్యాధుల నిర్మూలనలో ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం వల్ల కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయని మంత్రికి వెల్లడించిన ఆరోగ్య శాఖ అధికారులు.
సీజనల్ వ్యాధుల కట్టడిపై మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల్లో అవగాహనను కల్పించామని తెలిపారు అధికారులు.ఈ సందర్భంగా సీజనల్ వ్యాధులు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర్ రాజనర్సింహా. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులలో సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని మంత్రి దామోదర్ రాజనర్సింహా కు ఆరోగ్య అధికారులు వివరించారు.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. ప్రీ-మెనోపాజ్ కారణంగా ఎలాంటి సమస్యలు వస్తాయి..? అవేంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
