Health Sector in the Budget: 17 రకాల కేన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత.. 

షేర్ చేయండి:
Health Sector in the Budget: 17 రకాల కేన్సర్ ఔషధాలపై కస్టమ్స్ డ్యూటీ ఎత్తివేత.. 

సాక్షి లైఫ్ : తాజాగా పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఈసారి వైద్య ఆరోగ్య రంగానికి మిశ్రమ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాణాంతక కేన్సర్ వ్యాధితో పోరాడుతున్న వారికి ఊరటనిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, మొత్తం కేటాయింపుల విషయంలో ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

బడ్జెట్లోని హైలైట్స్..

కేన్సర్ మందులపై రాయితీ.. 17 రకాల కేన్సర్ సంబంధిత మందులు, ఇంజక్షన్లపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల రోగులకు మందుల ధరలు అందుబాటులోకి రానున్నాయి.

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆరోగ్య రంగానికి రూ.1.05 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు 6 శాతం అధికం. వచ్చే ఏడాదిలో 1.5 లక్షల మంది ఆరోగ్య సంరక్షకులకు (Caregivers) ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే మెడికల్, నర్సింగ్ సీట్ల సంఖ్యను కూడా పెంచనున్నారు. ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ PM-JAY పథకానికి నిధులను రూ.9,500 కోట్లకు పెంచారు.

నిపుణుల ఆందోళన.. 

బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్ధిక నిపుణులు పెదవి విరుస్తున్నారు. వారి విశ్లేషణ ప్రకారం..దేశ జీడీపీలో ఆరోగ్య రంగం వాటా 2.5 శాతానికి చేరాలన్న లక్ష్యం ఇంకా నెరవేరలేదు. బడ్జెట్ ఎక్కువగా పెద్ద ఆసుపత్రులు, ఫార్మా రంగంపైనే దృష్టి పెట్టిందని, వ్యాధుల నివారణ (Prevention) ఇన్ఫెక్షన్ కంట్రోల్ వంటి అంశాలను విస్మరించిందని  వైద్యనిపుణులు చెబుతున్నారు.

 దేశంలో ఆరోగ్య ఖర్చుల్లో ఇప్పటికీ 50 శాతం ప్రజలే భరిస్తున్నారు (Out-of-pocket expenditure). ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదవాడికి అందుతున్న సాయం ఏడాదికి సగటున రూ.190 మాత్రమేనని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల సాధికారతకు , ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి స్పష్టమైన కార్యాచరణ అవసరమని విశ్లేషకులు అంటున్నారు.

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.