సాక్షి లైఫ్: ఒత్తిడి కారణంగా శరీరంలోని అనేక అవయవాలపై దాని ప్రభావం పడుతుంది. ఆ ఎఫెక్ట్ కళ్ల మీద పడడం వల్ల గ్లకోమా సంభవిస్తుంది. ఇది కంటి సంబంధిత సమస్య. బీపీ పెరగడం వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుందో, అలాగే ఒత్తిడి పెరగడం వల్ల కళ్లకు కూడా హాని కలుగుతుంది. దీనిని సకాలంలో నియంత్రించాలి. ఒత్తిడి కారణంగా, కళ్ల వెనుక ఉన్న సిరలు ఎండిపోవడం ప్రారంభమవుతాయి. అంతేకాదు వాటి సామర్థ్యం కోల్పోతాయి.
ఇది కూడా చదవండి.. కొత్త వేరియంట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది..?
కంటిశుక్లం, గ్లకోమా లేదా బ్లాక్ క్యాటరాక్ట్‌ను 'కంటి చూపు దొంగ' అని కూడా అంటారు, ఎందుకంటే దీనికి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. దృష్టి క్రమంగా తగ్గిపోతుంది. బ్లాక్ క్యాటరాక్ట్ , వైట్ క్యాటరాక్ట్ రెండింటిలో, చూపు క్రమంగా తగ్గుతుంది. కానీ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. వైట్ క్యాటరాక్ట్‌లో ఆపరేషన్ తర్వాత చూపు తిరిగి వస్తుంది. కానీ బ్లాక్ క్యాటరాక్ట్‌లో కోల్పోయిన దృష్టి తిరిగి రాదు. దీనికి ప్రధాన కారణం క్యాటరాక్ట్‌లో కళ్లలోని అంతర్గత నరాలు దెబ్బతింటాయి. అంటే కళ్లకు మెదడుకు అనుసంధానంగా ఉండే నరాలు పనిచేయకపోవడం వల్ల కంటి చూపు దెబ్బతింటుంది.
అందుకే ప్రజల్లో గ్లకోమాపై అవగాహనా కల్పించేందుకే ప్రతి సంవత్సరం మార్చి 12న వరల్డ్ గ్లకోమా డేని ప్రపంచవ్యాప్తంగా జరుపుతారు. ఈరోజున ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
కంటిశుక్లం ఎందుకు వస్తుంది..?
కంటిశుక్లం రావడానికి అతి పెద్ద కారణం కంటి ఒత్తిడి పెరగడం. ఈ అసమస్యను సకాలంలో నియంత్రించడం చాలా అవసరం. ఒత్తిడి కారణంగా, కళ్ల వెనుక ఉన్న సిరలు ఎండిపోతాయి. వాటి పని సామర్థ్యం కోల్పోతాయి. ఈ నరాలు ఒకసారి చచ్చుబడితే వాటిని తిరిగి తీసుకురాలేము.
లక్షణాలు..?
ఒత్తిడి పెరిగినప్పుడు, కళ్ళ చుట్టూ, తల నొప్పి వస్తుంది.
చూపు మందగిస్తుంది..
లైటింగ్ వైపు చూసినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఎప్పుడైనా కళ్లలో విపరీతమైన నొప్పి అనిపిస్తే.. ఒక్కసారిగా కళ్లపై ఒత్తిడి పెరిగిందని అర్థం చేసుకోవాలి..
పిల్లలకు..
కొన్నిసార్లు పిల్లలలో కంటిశుక్లం కూడా వస్తుంది. సాధారణంగా ఈ సమస్య పుట్టుకతో వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో పుట్టుక తర్వాత వస్తుంది. అయినప్పటికీ, పిల్లలలో గ్లకోమా కేసులు చాలా అరుదుగా వస్తుంటాయి. ఏ సమస్య వచ్చినవారి కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి. కన్నీళ్లు నిరంతరం వస్తూ ఉంటాయి. వెలుతురులో కళ్లు తెరవడానికి ఇబ్బంది పడతారు. చాలామందిలో కంటిశుక్లం 40-45 సంవత్సరాల వయస్సు తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది.
స్క్రీన్ సమయం..
ప్రస్తుతం ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్ల స్క్రీన్‌లపై ఎక్కువ సమయం గడుపుతున్నారు. అయితే, ఇది కంటిశుక్లం ప్రత్యక్ష కారణం కాదు. స్క్రీన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కంటిశుక్లం పెరుగుతుందా లేదా అనేదానిపై ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు. కుటుంబంలో ఎవరికైనా ఇంతకు ముందు గ్లకోమా ఉంటే, వారి పిల్లల కు ఆ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి, ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాలి.
ఏం చేయాలి..?
రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నట్లే, దృష్టి , కంటి ఒత్తిడిని కూడా సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు కళ్లపై పెరుగుతున్న ఒత్తిడిని గుర్తించలేము. అలాంటి సమయంలో సమస్య పెరుగుతూనే ఉంటుంది. పరీక్ష చేయించుకోవడం ద్వారా క్యాటరాక్ట్‌ను ముందుగా గుర్తిస్తే సరైన సమయంలో సరైన చికిత్స అందించవచ్చు.
40 ఏళ్ల తర్వాత..
40 ఏళ్ల తర్వాత,కనీసం ప్రతి సంవత్సరం ఒకసారి కంటి పరీక్ష అవసరం. స్క్రీన్ టైంను తగ్గించడం మంచిది. స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నప్పుడు, చుట్టూ తగినంత లైటింగ్ ఉండేలా చూసుకోండి, చీకటిలో పని చేయవద్దు. ప్రతి అరగంటకు, దూరంగా చూసేందుకు ఐదు నిమిషాల విరామం తీసుకోండి. తద్వారా కళ్లకు కొంత ఉపశమనం కలుగుతుంది.
నిరంతరం దగ్గరగా చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతుంది.
కళ్ళు రెప్పవేయకుంటే కళ్లుపొడిబారుతాయి.
కళ్లలో పొడిబారినప్పుడు మంటగా , దురదగా అనిపిస్తుంది.
కంటికి అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి.
అప్రమత్తత అవసరం..
ఆహారంలో విటమిన్లు , పోషకాలను చేర్చుకోండి..
వీలైనంత వరకు స్క్రీన్ టైమ్ తగ్గించాలి..
తగినంత వ్యాయామం, శారీరక శ్రమ చేయాలి..
మధుమేహం, రక్తపోటు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే ఇవన్నీ కళ్ళపై ప్రభావాన్ని చూపుతాయి. మధుమేహం ఉన్నవారిలో కంటిశుక్లం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.
ఇది కూడా చదవండి.. కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com