సాక్షి లైఫ్ : భారతదేశంలో వైద్య విద్య సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన (Union Cabinet meeting)కేంద్ర కేబినెట్ సమావేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ), అండర్ గ్రాడ్యుయేట్(PG and UG seats) (ఎంబీబీఎస్) వైద్య సీట్ల విస్తరణ((MBBS medical seats)కు ఆమోదం లభించింది.
ఇది కూడా చదవండి.. ఐస్ట్రోక్ అంటే ఏమిటి..? కారణాలు, లక్షణాలు, చికిత్స..?
ఇది కూడా చదవండి.. మైగ్రేన్ పెయిన్ కు గుండెపోటుకు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
కేబినెట్ ఆమోదించిన 'సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (Centrally Sponsored Scheme)' ఫేజ్-త్రీ కింద రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు.
ఇప్పటికే ఉన్న రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ వైద్య కళాశాలలు, స్టాండ్‌అలోన్ పీజీ ఇన్‌స్టిట్యూట్‌లు, ప్రభుత్వ ఆసుపత్రులలో 5వేల పీజీ సీట్లను పెంచడానికి ఆమోదం లభించింది.
ఐదువేల 23 ఎంబీబీఎస్ సీట్ల పెంపు..
ప్రస్తుత ప్రభుత్వ వైద్య కళాశాలల ఉన్నతీకరణ ద్వారా ఐదువేల 23 ఎంబీబీఎస్ సీట్లను పెంచడానికి ఆమోదం. ఒక్కో సీటుకు అయ్యే వ్యయ పరిమితిని రూ.1.50 కోట్లకు పెంచారు.
ఈ మొత్తం విస్తరణకు రూ.15,034.50 కోట్ల ఆర్థిక మంజూరును 2025-26 నుంచి 2028-29 కాలానికి కేబినెట్ ఆమోదించింది. ఇందులో కేంద్ర వాటా రూ.10,303.20 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.4,731.30 కోట్లుగా ఉంది.
ప్రయోజనం ఏమిటి..?
ఈ పథకాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అదనపు పీజీ సీట్ల ద్వారా దేశంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది, ముఖ్యంగా అత్యవసర విభాగాలలో నిపుణులు అందుబాటులోకి వస్తారు.
నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ: వైద్యుల లభ్యత పెరగడం ద్వారా, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, అల్పాదాయ వర్గాలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందుతాయి.
ఉపాధి కల్పన..
డాక్టర్లు, ఫ్యాకల్టీ, పారామెడికల్ సిబ్బంది, పరిశోధకులు, నిర్వాహకులు, సహాయక సేవలకు సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ప్రాంతీయ సమానత్వం: రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల సమతుల్య పంపిణీని ప్రోత్సహిస్తుంది.
వైద్య విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు: దేశంలోనే వైద్య విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
అమలు..
ఈ పథకాల లక్ష్యం 2028-2029 నాటికి ప్రభుత్వ సంస్థలలో మొత్తం 5000 పీజీ సీట్ల సంఖ్య 5023కు యూజీ సీట్లు పెంచడం. దీని అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది.
గత దశాబ్దంలో, భారతదేశం వైద్య విద్య రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం దేశంలో 808 వైద్య కళాశాలలు ఉన్నాయి, ఇవి ప్రపంచంలోనే అత్యధికం. గత దశాబ్దంలో 69,352 కొత్త ఎంబీబీఎస్ సీట్లు (127% వృద్ధి), 43,041 పీజీ సీట్లు (143% వృద్ధి) పెరిగాయి. ఈ వృద్ధి ఉన్నప్పటికీ, డిమాండ్‌కు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్ వై) PMSSY కింద మంజూరైన 22 కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కూడా వైద్యనిపుణులను తయారు చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..Reduce stress : స్ట్రెస్ తగ్గాలంటే ఎలాంటి ఫుడ్స్ అవసరం..?
ఇది కూడా చదవండి.. దంత సమస్యలు.. వాస్తవాలు..
ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com