అమెరికాలో మరణాలకు కారణమవుతున్న టాప్ టెన్ డిసీజెస్..?

సాక్షి లైఫ్ : కోవిడ్-19 మరణాలు తగ్గడం శుభవార్తే అయినప్పటికీ, దీర్ఘకాలిక వ్యాధుల పెరుగుదల ఒక ఆరోగ్య సంక్షోభానికి సంకేతంగా నిలుస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్-19 మహమ్మారి మరణాల జాబితా నుంచి తొలిసారిగా బయటపడింది. అమెరికాలో ప్రజల మరణాలకు ప్రధాన కారణాల జాబితాలో కోవిడ్-19 ఇప్పుడు లేదు. అయితే, ఇది మంచి వార్త కాదు. కొత్త నివేదిక ప్రకారం, మరికొన్ని తీవ్రమైన వ్యాధులు మళ్ళీ పంజా విసురుతున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ ఆందోళన కలిగించే విషయాన్ని వెల్లడించింది. 

 ఇది కూడా చదవండి.. పిల్లల్లో ఈ 5 లక్షణాలు కనిపిస్తే విటమిన్-డి లోపమే..!

 ఇది కూడా చదవండి.. లేట్ నైట్ లో ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు ఎందుకు..?

 ఇది కూడా చదవండి.. వంట నూనెకు చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి లింక్ ఏంటి..?

 

జాబితాలో..

కోవిడ్-19 స్థానంలో ఆత్మహత్యలు (Suicides) మొదటి పది స్థానాల్లోకి చేరడం మరింత ఆందోళన కలిగిస్తోంది. గత కొన్నేళ్లుగా మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతుండటం, ప్రజల్లో ఒత్తిడి, నిస్సహాయత భావనలు పెరగడం దీనికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఒక ఆరోగ్య హెచ్చరికగా పరిగణించాలి.

ప్రధాన కారణాలు..!

కరోనా మరణాలు తగ్గినా, అమెరికా ప్రజలను ఇంకా వెంటాడుతున్న ప్రధాన ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు. సీడీసీ నివేదిక ప్రకారం, మరణాలకు ప్రధాన కారణాలు ఈ విధంగా ఉన్నాయి. 

గుండె జబ్బులు (Heart Disease): ఇది మొదటి స్థానంలో కొనసాగుతూనే ఉంది. జీవనశైలిలో మార్పులు, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, పోషకాహార లోపం వంటివి గుండె జబ్బులకు కారణమవుతున్నాయి.

క్యాన్సర్ (Cancer): రెండో స్థానంలో క్యాన్సర్ కొనసాగుతోంది. ఇది కూడా జీవనశైలి, ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది.

అనుకోని గాయాలు (Unintentional Injuries): మూడో స్థానంలో ప్రమాదాలు, డ్రగ్స్ ఓవర్‌డోస్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా డ్రగ్స్ వాడకం వల్ల మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

పక్షవాతం (Stroke): మెదడుకు రక్తం సరఫరాలో ఆటంకం ఏర్పడటం వల్ల వచ్చే ఈ వ్యాధి మరణాలకు నాలుగో కారణం.

దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు (Chronic Lower Respiratory Diseases) ఐదో కారణం : పర్యావరణ కాలుష్యం, ధూమపానం వంటి కారణాలతో ఈ వ్యాధులు పెరుగుతున్నాయి.

ఆరో కారణం..అల్జీమర్స్ (Alzheimer's Disease): వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న వారిలో అల్జీమర్స్ వల్ల మరణాలు పెరుగుతున్నాయి.

ఏడో కారణం..మధుమేహం (Diabetes): షుగర్ వ్యాధితో మరణించే వారి సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఎనిమిదో కారణం..మూత్రపిండాల వ్యాధి (Kidney Disease): డయాబెటిస్, అధిక రక్తపోటు వల్ల కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి.

తొమ్మిదో కారణం.. దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు (Chronic Liver Disease): మద్యం సేవనం, ఆహారపు అలవాట్ల వల్ల కాలేయ వ్యాధులు పెరుగుతున్నాయి.

పదో కారణం.. ఆత్మహత్య (Suicide): ఈ జాబితాలోకి ఆత్మహత్యలు రావడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. ప్రజలు తమ జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకొని, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అత్యవసరం అని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
 

 ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : diabetes heart-disease deaths-covid-19 cancer-deaths respiratory-disease usa america corona-virus cancer-cases suicide-prevention alzheimers stroke kidney-disease liver-disease suicide
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com