డ్రాగన్ కంట్రీలో వేగంగా వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటానిమోవైరస్.. 

షేర్ చేయండి:
డ్రాగన్ కంట్రీలో వేగంగా వ్యాప్తి చెందుతున్న హ్యూమన్ మెటానిమోవైరస్.. 

సాక్షి లైఫ్ : కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచదేశాలను వణికించింది. కరోనా తర్వాత కొన్ని తర్వాత, చైనాలో మరోసారి కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. అదే హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్ఎంపివి). ఈ  కొత్త వైరస్ నెమ్మదిగా చైనా మొత్తం వ్యాపిస్తోంది. దీంతో ఈ వైరస్ గురించిన వార్త మరింత వేగంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో చక్కెర్లు కొడుతోంది. హ్యూమన్ మెటానిమోవైరస్ గురైన వారిలో పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు తెలుస్తోంది. 

హెచ్ఎంపీవీతోపాటు ఇన్ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు ,వీడియోలలో, చైనాలోని ఆసుపత్రులు రోగులతో నిండి ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. 

 

ఇది కూడా చదవండి..శీర్షాసనంతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు..?

ఇది కూడా చదవండి..విటమిన్ బి1లోపిస్తే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? 

ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?

ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..

ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?

 

శ్మశాన వాటికల వద్ద కూడా జనాలు కనిపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం చైనా ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. హెచ్ఎంపివితో పాటు, ఇన్ఫ్లుఎంజా ఏ , మైకోప్లాస్మా న్యుమోనియా వంటి ఇతర వైరస్లు కూడా అక్కడ వ్యాప్తి చెందుతున్నాయట.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ (ట్విట్టర్ )ఎక్స్ లో ‘SARS-CoV-2 (Covid-19)’ పేరుతో ఉన్న హ్యాండిల్ ప్రకారం, చైనాలో చాలా మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇన్‌ఫ్లుఎంజా, హెచ్‌ఎంపీవీ, న్యుమోనియా, కరోనా వంటి అనేక రకాల వైరస్‌లతో వారు బాధపడుతున్నారు. ఈ వ్యాధుల కారణంగా ఆసుపత్రులు, శ్మశాన వాటికలు చాలా రద్దీగా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల ఆసుపత్రుల్లో న్యుమోనియా, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల కేసులు మరింతగా పెరిగాయి" అని చైనాలోని కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు వెల్లడిస్తున్నారు.  

 

ఇది కూడా చదవండి..పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు మీకు తెలుసా..?

ఇది కూడా చదవండి..స్త్రీలలో క్యాల్షియం లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడానికి ముఖ్యమైన డయాగ్నొస్టిక్ టెస్టులు ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.