మహిళలు ఆరోగ్యంగా ఉంటే, కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటాయి: సీఎం రేవంత్ రెడ్డి

షేర్ చేయండి:
మహిళలు ఆరోగ్యంగా ఉంటే, కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటాయి: సీఎం రేవంత్ రెడ్డి

సాక్షి లైఫ్ : గచ్చిబౌలి స్టేడియంలో సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో  'పింక్ పవర్ రన్ 2024' పేరుతో 5కె రన్, 10కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది" అని తెలిపారు.

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.

ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?

ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన 'పింక్ పవర్ రన్' చాలా గొప్ప కార్యక్రమమని కొనియాడారు. "మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం సంతోషంగా ఉంటాయి" అని ఆయన పేర్కొన్నారు.  "వైద్య రంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీఠవేస్తోంది" అని చెప్పారు. సుధారెడ్డి ఫౌండేషన్ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో పింక్ పవర్ 5 కె ,10 కె రన్‌లో గెలుపొందిన విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు సుధారెడ్డికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?

ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?

 ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.