Innovative Experiment in America : ఇక ఏఐ చేస్తుంది..! డాక్టర్ అవసరం లేదు..
సాక్షి లైఫ్ : వైద్య రంగంలో మరో సంచలనం నమోదైంది. రోగికి మందులు కావాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అనే నిబంధన ఇక పాతబడనుంది. అమెరికాలోని ఉటా (Utah) రాష్ట్ర ప్రభుత్వం, 'డాక్ట్రానిక్' (Doctronic) అనే హెల్త్-టెక్ స్టార్టప్‌తో కలిసి ఒక సంచలన పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. దీని ప్రకారం.. కొన్ని రకాల మందుల ప్రిస్క్రిప్షన్ ప్రక్రియను ఇకపై మనుషుల ప్రమేయం లేకుండా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మాత్రమే చూసుకుంటుంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఏమిటీ పైలట్ ప్రాజెక్ట్..అంటే..?
సాధారణంగా దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ప్రతిసారీ ప్రిస్క్రిప్షన్ కోసం డాక్టర్ చుట్టూ తిరగడం రోగులకు భారంగా, అటు వైద్యులకు సమయం వృధాగా మారుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఉటా ప్రభుత్వం ఈ సాఫ్ట్‌వేర్‌కు అనుమతినిచ్చింది. ఈ వ్యవస్థ రోగి ఆరోగ్య చరిత్రను విశ్లేషించి, వారికి అవసరమైన మందులను ఆటోమేటిక్‌గా రెన్యూ చేస్తుంది.
ప్రయోజనాలు ఇవే..
తక్కువ ఖర్చు.. డాక్టర్ విజిటింగ్ ఫీజులు తగ్గి, రోగులపై ఆర్థిక భారం తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత ఉన్న చోట ఈ విధానం ఎంతో కీలకం కానుంది. మందులు అయిపోయినప్పుడు ప్రిస్క్రిప్షన్ లేక చికిత్సలో జాప్యం జరగకుండా AI చూసుకుంటుంది.
వైద్య నిపుణుల ఆందోళన..
అయితే, ఈ నిర్ణయంపై అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (AMA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైద్యుడి పర్యవేక్షణ లేకుండా మందులు ఇవ్వడం ప్రమాదకరమని హెచ్చరిస్తోంది. వ్యసనపరులు ఈ ఆటోమేటెడ్ వ్యవస్థలను తప్పుదోవ పట్టించి డ్రగ్స్ పొందే అవకాశం ఉంది. ఔషధాల వల్ల కలిగే రియాక్షన్లను లేదా రోగి ఆరోగ్య స్థితిలో వచ్చే సూక్ష్మ మార్పులను AI గుర్తించలేకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నియంత్రణ సంస్థల మౌనం..
ప్రస్తుతానికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (FDA) ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. ఒకవేళ భవిష్యత్తులో ఈ ప్రక్రియను నియంత్రించాలని FDA భావిస్తే, ఈ ప్రాజెక్ట్ గమనం మారవచ్చు. టెక్నాలజీపై నమ్మకం పెంచడమే తమ ముందున్న అతిపెద్ద సవాలని ఉటా వాణిజ్య విభాగం పేర్కొంది. సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతున్నా, ప్రాణాలతో ముడిపడి ఉన్న వైద్య రంగంలో AI ఎంతవరకు సఫలమవుతుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
