International Guidelines : ప్రోటీన్ విషయంలో మారిన అంతర్జాతీయ మార్గదర్శకాలు..
సాక్షి లైఫ్ : మన శరీర నిర్మాణానికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క ముక్కలో చెప్పాలంటే..? ప్రాణాధారమైది. అలాంటి 'ప్రోటీన్' విషయంలో అంతర్జాతీయ మార్గదర్శకాలు పూర్తిగా మారాయి. గతంలో సూచించిన మోతాదు కంటే దాదాపు రెట్టింపు ప్రోటీన్ తీసుకోవాలని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మాంసాహారం, పాల ఉత్పత్తులను ఆహారంలో అంతర్భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సగటు మనిషికి అసలు ఎంత ప్రోటీన్ అవసరం..? నిపుణుల లెక్కలేమిటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
మోతాదు పెరిగిందిలా..
గతంలో ప్రతి కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ సరిపోతుందని భావించేవారు. కానీ, కొత్తగా విడుదలైన 2025-2030 మార్గదర్శకాల ప్రకారం. సాధారణ వయోజనులు: కిలో బరువుకు 1.2 నుంచి 1.6 గ్రాముల ప్రోటీన్ అవసరం. అంటే 70 కిలోల బరువున్న వ్యక్తికి రోజుకు సుమారు 84 నుంచి 112 గ్రాముల ప్రోటీన్ కావాలి. వయసు పెరిగే కొద్దీ వచ్చే కండరాల క్షీణతను (Sarcopenia) అడ్డుకోవడానికి వీరు అధిక మోతాదులో ప్రోటీన్ తీసుకోవాలి. జిమ్‌కు వెళ్లేవారు లేదా క్రీడాకారులు కిలోకు 1.4 నుంచి 2 గ్రాముల వరకు తీసుకోవచ్చు.
మాంసాహారం..పాల ఉత్పత్తులు..
కొత్త మార్గదర్శకాల్లో మాంసాహారం, పాల ఉత్పత్తుల చుట్టూ ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం జరిగింది. రెడ్ మీట్.. పరిమితంగా తీసుకుంటే రెడ్ మీట్ అనేది ఐరన్, బి-విటమిన్లు ,నాణ్యమైన ప్రోటీన్‌కు అత్యుత్తమ వనరు అని నిపుణులు పేర్కొంటున్నారు.
వెన్న తీయని పాలు (Full-fat milk), పెరుగు వంటివి ఆకలిని అదుపులో ఉంచడమే కాకుండా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలను అందిస్తాయని స్పష్టం చేశారు. వంటల్లో వెన్న (Butter) లేదా బీఫ్ టాలో (Beef tallow) వంటి సహజ కొవ్వులను వాడటం వల్ల పోషకాల గ్రహింపు పెరుగుతుందని సూచించారు.
జాగ్రత్తలూ అవసరమే..!
ప్రోటీన్ పెంచమన్నారు కదా అని విచ్చలవిడిగా తినడం కూడా సరికాదని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. రోజువారీ కేలరీలలో శాచురేటెడ్ ఫ్యాట్ (Saturated Fat) 10 శాతం మించకుండా చూసుకోవాలి.
కేవలం మాంసమే కాకుండా గుడ్లు, చేపలు, పప్పు ధాన్యాలు, గింజలు (Nuts) వంటి వివిధ రకాల వనరుల నుంచి ప్రోటీన్ పొందాలి. ప్రోటీన్ పెంచే క్రమంలో ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలను (Processed Carbs), పంచదార వంటివాటిని తగ్గించడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
శరీర దారుఢ్యం, రోగనిరోధక శక్తి పెరగాలంటే ప్రోటీన్ అవసరం. అయితే వయసు, చేసే పని, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎంత ప్రోటీన్ అవసరమో వైద్యనిపుణులను సంప్రదించి నిర్ణయించుకోవడం చాలా బెటర్.
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
