డెంగ్యూని నిర్మూలించేందుకు కర్ణాటకలో సరికొత్త మార్గదర్శకాలు..
సాక్షి లైఫ్ : కర్ణాటకలో డెంగ్యూ కేసులు జనాలను వణికిస్తున్నాయి. రోజురోజుకూ డెంగ్యూ కేసులు భారీగా పెరగడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. డెంగ్యూ కేసుల నిర్మూలనలో భాగంగా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. ఆయా నిర్ణయాల్లో భాగంగా డెంగ్యూని అంటువ్యాధిగా ప్రకటించింది అక్కడి సర్కారు. దీంతో పాటు నిబంధనలు పాటించని వారిని కఠినంగా శిక్షించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి..ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎలాంటి ఆహారాల నుంచి పొందవచ్చు..?
ఇది కూడా చదవండి..జుట్టు, చర్మ సంరక్షణకు విటమిన్ "ఇ" చేసే మేలు తెలుసా..?
ఇది కూడా చదవండి..ప్రోటీన్ ఫుడ్ దేనికి ప్రయోజనకరం..?
నిబంధనలు పాటించని వారిపై చర్యలు..
నిబంధనలు ఉల్లంఘించిన వారిని ప్రభుత్వం శిక్షిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని, దీంతో పాటు నిబంధనలు పాటించని వారిని కఠినంగా శిక్షించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకోని వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం.
ఎపిడెమిక్ డిసీజ్ రెగ్యులేషన్‌కు సవరణ..
కర్నాటక ఎపిడెమిక్ డిసీజెస్ రెగ్యులేషన్ 2020కు ప్రభుత్వం సవరణ చేసింది. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల వ్యాప్తిని నిరోధించడంలో ప్రజలు మరింత బాధ్యత వహించాలని ఆదేశించింది. సవరణ మూడు విభాగాలలో జరిమానాలను ప్రతిపాదిస్తుంది. దేశీయ, వాణిజ్య, క్రియాశీల నిర్మాణ రంగాల ప్రాతిపదికన జరిమానా విధించనున్నారు.
రూ. 2,000 జరిమానా..
నిబంధనలు పాటించనివారికి రూ.2000 వరకు జరిమానా. ప్రభుత్వం జరిమానా రూ.400, పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లోని గృహాలకు రూ.200. వాణిజ్య, పట్టణ ప్రాంతాల్లో రూ.1000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.500 జరిమానా విధిస్తారు. దోమలు నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోతే ఇంటి యజమానులకు పట్టణ ప్రాంతాల్లో రూ. 2,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,000 జరిమానా విధించనున్నారు.
ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం గృహ, భవనాల యజమానులు దోమల వృద్ధిని నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. నోటిఫికేషన్ ప్రకారం, ప్రజలు దోమల వృద్ధిని నిరోధించడానికి నీటి నిల్వ కంటైనర్‌లు, సంప్‌లు లేదా ఓవర్‌హెడ్ ట్యాంక్‌లను మూతలను కప్పి ఉంచాల్సి ఉంటుంది. అలా చేయకపోయినా జరిమానా విధిస్తారు.
ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుందా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
