కిడ్నీ రాకెట్ కేసు : ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక ఆదేశాలు..
సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి సీఐడీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్)కి విచారణను అప్పగించాలని ఆదేశించారు. ఈ కేసును ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందని మంత్రి పేర్కొన్నారు. కిడ్నీ రాకెట్ కేసు విషయంపై ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, "కిడ్నీ రాకెట్ కేసులో నేరానికి పాల్పడిన ప్రతి ఒక్కరినీ పట్టుకోవాలి..
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
అందుకోసం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే, దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు విధించడానికి ప్రభుత్వం నడుస్తున్న చర్యలు మరింత కఠినతరంగా ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. "ఇలాంటి దోషులపై కఠినమైన చర్యలు తీసుకుని, వారు చేసిన నేరాలకు తగిన శిక్ష విధించాలని అన్నారు. ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా చర్యలు తీసుకోవాలి," అని మంత్రి హెచ్చరించారు.
సీఐడీ విచారణ..
సీఐడీ అధికారులు ఇప్పటికే ఈ కేసు గురించి దర్యాప్తు ప్రారంభించారు. దోషులను పట్టుకునేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై ప్రభుత్వం నుంచి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
