ఇసావోట్ ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్ ను అందుబాటులోకి తెచ్చిన ప్రముఖ పొడియాట్రిక్ సర్జన్.. 

షేర్ చేయండి:
ఇసావోట్ ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్ ను అందుబాటులోకి తెచ్చిన ప్రముఖ పొడియాట్రిక్ సర్జన్.. 

సాక్షి లైఫ్ : ప్రముఖ వాస్కులర్, ఎండోవాస్కులర్, పొడియాట్రిక్ సర్జన్ డాక్టర్ నరేంద్రనాథ్ మేడా ఇసావోట్ ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌ను హైదరాబాద్ లోని తమ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ అధునాతన ఎంఆర్ఐ మిషన్, హైదరాబాద్‌ తోపాటు పరిసర ప్రాంతాల్లో రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు సాంకేతికంగా సహాయపడుతుంది.

డాక్టర్ నరేంద్రనాథ్ మేడా మాట్లాడుతూ, "ఈ కొత్త ఎంఆర్ఐ మెషీన్  పొడియాట్రిక్ రోగులకు గేమ్-ఛేంజర్‌గా మారుతుంది. సంక్లిష్ట పరిస్థితులను ప్రారంభ దశలోనే నిర్ధారించి, మెరుగైన చికిత్స అందించడానికి ఇది సహాయపడుతుంది," అని తెలిపారు.

ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?

ఇది కూడా చదవండి..వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందా..?

ఇది కూడా చదవండి..పొగతాగని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణాలు ఇవే.. 

ఇసావోట్ ఆసియా పసిఫిక్ డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంట్రీ బిజినెస్ డైరెక్టర్ ధీరజ్ నాసా మాట్లాడుతూ, "ఈ సాంకేతికత పొడియాట్రిక్ చికిత్సకు విప్లవాత్మక మార్పును తీసుకురాగలదు. ఇది రోగుల సంరక్షణకు ఉన్న ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తుంది," అని చెప్పారు.

ఓ-స్కాన్ ఎంఆర్ఐ మిషన్, ఖచ్చితమైన రోగనిర్ధారణ, వేగవంతమైన స్కానింగ్ , రోగులకు సౌకర్యాన్ని అందించే విధంగా రూపొందించారు. దీని ద్వారా పొడియాట్రిక్ రోగులకే కాకుండా, మస్క్యులోస్కెలెటల్ , మృదు కణజాల పరిస్థితులపై ఖచ్చితమైన ఇమేజింగ్ ఫలితాలను అందించడం సాధ్యం అవుతుంది.ఈ సాంకేతికత, రోగులకు మరింత భరోసా, విశ్వాసం, మెరుగైన ఫలితాలను ఇవ్వనుంది.

ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?

ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..

ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.